Samantha : సమంత కావాలనే ‘ ఆ ‘ బట్టలు వేసుకుందా .. చైతన్య కి చిరాకు తెప్పించాలనే ?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 20 April 2023, 6:00 pm

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నాక సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. అయినా సమంతకు ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సీటాడెల్ వెబ్ సిరీస్లో నటించింది. అయితే ఈ సీటాడెల్ కోసం సమంత లండన్ కు వెళ్లింది.

Samantha stunning looks in black dress

Samantha stunning looks in black dress

రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ వెర్షన్ కి తెలుగు ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు కలిసిన ఈ సీటాడెల్ ఇండియన్ వర్షన్ లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో లండన్ లో జరిగింది. ఈ ఈవెంట్లో ప్రియాంక చోప్రా, రీఛర్డ్ తో పాటు సమంత, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. సమంత బ్లాక్ డ్రెస్ లో డైమండ్ నెక్లెస్ పెట్టుకొని సరికొత్త స్టైల్ లో దర్శనం ఇచ్చింది.

Samantha stunning looks in black dress

Samantha stunning looks in black dress

ఇప్పటివరకు సమంతను ఈ డ్రెస్ లో ఎప్పుడు చూడలేదు. ఈ ఫోటోలను సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఆమె అభిమానులు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత సైతం సమంత లుక్స్ కి స్టన్నింగ్ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత అందం రోజురోజుకీ పెరుగుతుంది అని అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి