Samantha : నా జీవితంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.. సమంత పోస్ట్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : నా జీవితంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.. సమంత పోస్ట్ వైరల్

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఈ అమ్మ‌డు ఏ ఫొటో షేర్ చేసిన ,ఏ పోస్ట్ పెట్టినా కూడా క్ష‌ణాలలో వైర‌ల్ అవుతుంటుంది. ఈ అమ్మ‌డు ఏ పాత్ర చేసిన ఇట్టే ఒదిగిపోతుంది.ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌లో రాజీగా అదరగొట్టినా, పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటం సాంగ్‌తో కవ్వించినా అది ఒక్క సామ్‌కే చెల్లుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టిన ఈ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 March 2022,4:00 pm

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఈ అమ్మ‌డు ఏ ఫొటో షేర్ చేసిన ,ఏ పోస్ట్ పెట్టినా కూడా క్ష‌ణాలలో వైర‌ల్ అవుతుంటుంది. ఈ అమ్మ‌డు ఏ పాత్ర చేసిన ఇట్టే ఒదిగిపోతుంది.ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌లో రాజీగా అదరగొట్టినా, పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటం సాంగ్‌తో కవ్వించినా అది ఒక్క సామ్‌కే చెల్లుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టిన ఈ హీరోయిన్‌ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉంది. స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం విడుద‌ల‌కి సిద్ధం కాగా, పాన్‌ ఇండియా చిత్రం యశోదలో నటిస్తోంది.

సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఇక సమంత ఫిట్ నెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత ఎక్కువగా జిమ్ లో చెమటలు చిందిస్తూ అత్యంత కఠినంగా కసరత్తులు చేస్తూ ఉంటుంది. గతంలో 100 కేజీల బరువున్న బార్బెల్ ను కూడా ఎత్తి ఆశ్చర్యపర్చింది.

samantha stunning post viral

samantha stunning post viral

Samantha : సమంత ర‌చ్చ మామ‌లుగా లేదు..

స‌మంత విడాకుల త‌ర్వాత త‌న ఫ్రెండ్స్‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంది. సినిమా వాళ్ల‌కు సంబంధించిన ఫ్రెండ్స్‌తో కాకుండా బ‌య‌టి ఫ్రెండ్స్‌తో కూడా ఈ ముద్దుగుమ్మ తెగ తిరుగుతుంటుంది.అంతేకాదు వారికి ప్రత్యేక విషెస్ తెలియ‌జేస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా త‌న ఫ్రెండ్‌తో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ..నా జీవితంలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంద‌ని కామెంట్ పెట్టింది. ఈ అమ్మ‌డి పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది