samantha supports to kajal aggarwal
Samantha: కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. అయితే రీసెంట్‌గా హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై బాడీ షేమింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఇటీవల ట్రోలింగ్ జరిగింది. ఈ విషయంపై కాజల్ ఓ సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు. ‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా జీవితంలోనే అత్యంత కీలకమైన దశలో ఉన్నాను. ఈ సమయంలో నాపై కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్ మెసేజ్‌లు, మీమ్స్ నాకు నిజంగా ఏ విధంగానూ ఉపయోగపడవు. కొంచెం దయతో ఉండటం నేర్చుకోండి. అది కష్టంగా అనిపిస్తే మీ జీవితాన్ని మీరు జీవించండి. పక్కవారిని జీవించనివ్వండి అని సుదీర్ఘమైన పోస్ట్‌లో తెలిపింది..
కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ పొట్ట పెద్దదవుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడుతాయి. మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. సాధారణ సమయంలో కంటే ప్రెగ్నెన్సీ టైంలో త్వరగా అలిసిపోతాం, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. మన జీవితాల్లోకి ఓ పాపాయి రాబోతుందన్నప్పుడు వాటన్నింటినీ పట్టుకుని వేలాడుతూ అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవకండి. చిన్నారికి జన్మనివ్వడం అనేది వేడుక అన్న విషయాన్ని గుర్తుంచుకోండి’ అని చెప్పుకొచ్చారు కాజల్ అగర్వాల్.
samantha supports to kajal aggarwal
అయితే కాజల్ చేసిన ఈ పోస్ట్ మీద హీరోయిన్లు వరుసగా కామెంట్లు పెట్టేశారు. ఇందులో సమంత కూడా స్పందించింది. నువ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉన్నావ్ అని చెప్పుకొచ్చింది. నువ్వు ప్రతి దశలో పర్‌ఫెక్ట్, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. అలాగే రాశి ఖన్నా సైతం కాజల్‌కు మద్దతునిస్తూ తన పోస్టుపై స్పందించింది. వీరి కామెంట్స్‌పై కాజల్ సోదరి నిషా అగర్వాల్ స్పందిస్తూ.. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! నా గార్జియస్’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం కాజల్‌పై సెలబ్స్ చేసిన పోస్ట్‌లు చర్చనీయాంశంగా మారాయి.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.