Samantha : అక్కినేని బ్ర‌ద‌ర్స్‌కి స్ట్రోక్ ఇవ్వ‌బోతున్న స‌మంత‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : అక్కినేని బ్ర‌ద‌ర్స్‌కి స్ట్రోక్ ఇవ్వ‌బోతున్న స‌మంత‌

Samantha : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ఈ అమ్మ‌డు ర‌చ్చ చేసే హంగామా మాములుగా ఉండదు. ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు వెబ్ సిరీస్‌లు ఇంకో వైపు ఫోటో షూట్స్‌తో నానా హంగామా చేస్తుంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలో పాన్ ఇండియా సినిమా ‘యశోద’ ఒకటి. హరి-హరీష్ అనే యువ దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :6 April 2022,9:30 pm

Samantha : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ఈ అమ్మ‌డు ర‌చ్చ చేసే హంగామా మాములుగా ఉండదు. ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు వెబ్ సిరీస్‌లు ఇంకో వైపు ఫోటో షూట్స్‌తో నానా హంగామా చేస్తుంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలో పాన్ ఇండియా సినిమా ‘యశోద’ ఒకటి. హరి-హరీష్ అనే యువ దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ‘యశోద’ తెరకెక్కుతుంది.

సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న ‘యశోద’ సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు.‘యశోద’ మూవీ ఒక రోజు ముందు నాగ చైతన్య, హిందీ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌తో నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’ బాలీవుడ్ మూవీ ఒక రోజు ముందు ఆగష్టు 11న విడుదలవుతోంది. మరోవైపు సామ్ ‘యశోద’ విడుదల రోజునే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ కూడా విడుదల కానుంది. ఈ రకంగా తన సినిమాలతో ఏకంగా ఓ వైపు తన మాజీ భర్త నాగ చైతన్యతో పాటు మరిది ‘అఖిల్’కు ఏకంగా బాక్సాఫీస్ దగ్గర సవాల్ విసిరింది.ఇక ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కినవే.

samantha to fight with akkineni brothers

samantha to fight with akkineni brothers

Samantha : స‌మంతతో ఫైట్..

ఈ రకంగా విడాకుల తర్వాత సమంత.. తన సినిమాలతో అక్కినేని హీరోలకు బాక్సాఫీస్ సవాల్ విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా సమంత తన సినిమాలను నాగ చైతన్య, అఖిల్ సినిమాలకు పోటీగా విడుదల చేస్తుందా లేదా అనేది చూడాలి. నాగ చైత‌న్య – స‌మంత విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత జాత‌క‌మే బావుంది. ఆమెపై గ‌త ఏడాది ఉన్న నెగిటివిటీ ఏడాది చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. 2024 వ‌ర‌కు స‌మంత‌కు తిరుగులేదు. వీరితో పాటు పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న‌లకు కూడా తిరుగులేదు అన్నారు ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది