Home » Entertainment » Samantha Trolls On Pushpa Movie Item Song
Entertainment

Samantha : పుష్ప ఐటమ్ సాంగ్‌పై ట్రోల్స్.. తమిళ హీరో మూవీలోంచి కాపీ అంటూ కామెంట్స్..

Authored By
mallesh
The Telugu News | Published on: December 11, 2021, 3:40 pm
Advertisement

Pushpa : భారీ అంచనాలతో వస్తున్న పుష్ప మూవీ.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూనే ఉంది. ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తుండటంతో టాలీవుడ్‌లో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. మూవీలోని కారెక్టర్ల ఫొటోస్ ను సైతం రిలీజ్ చేస్తూ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది మూవీ యూనిట్. మొదటి నుంచి వివిధ షేడ్స్‌లో అల్లు అర్జున్ స్టిల్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ రష్మిక మంధనకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక దీని నుంచి తాజాగా రిలీజ్ అయిన సునీల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Advertisement

నెగెటివ్ షేర్స్ ఎక్కువగా ఉన్న పాత్రలో ఆయన యాక్ట్ చేశారని సమాచారం. ముందు నుంచి రిలీజ్ అవుతున్న పాటలు ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేశాయి.ఈ మూవీ నుంచి తాజాగా ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఊ అంటావా మామా.. ఊహు ఊహు అంటావా.. అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్షణాల్లోనే మిలియన్ వ్యూస్‌ను సాధించింది. సమంత మాస్ స్టెప్స్, దేవిశ్రీ బీట్ అందరినీ డ్యాన్సులు చేయిస్తున్నాయి. కానీ ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది.

trolls on pushpa movie item song

Advertisement

Pushpa : సూర్య మూవీలోనిదే అంటూ..

తమిళ హీరో సూర్య యాక్ట్ చేసిన వీడొక్కడే మూవీలోని హనీ.. హనీ.. సాంగ్‌ను కాపీ చేసినట్టున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఇందులో హీరోయిన్ శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించింది. మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి