Samantha : ఊ అంటావా మామ, ఊఊ అంటావా మామ.. ‘చచ్చిపోయా’ అంటూ సమంత ట్వీట్ వైరల్
Samantha : సమంత.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ మద్దుగుమ్మ పేరు మారుమోగుతోంది. కారణం ‘పుష్ప’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్.. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో ఎక్కడ చూసినా, ఎవరి నోట అయినా ముందుగా వినిపించే మాట ‘ఊ అంటావా మామ, ఊఊ అంటావా మామ’ అనేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌కు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఫన్నీగా డబ్బింగ్ చేస్తూ సోషల్ వీడియాలో పోస్టు చేస్తున్నారు. అవి కాస్త తెగ వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ మూవీలో సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించి మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. సాధారణంగా డైరెక్టర్ సుకుమార్ తన మూవీల్లో స్పెషల్ సాంగ్స్ పట్ల చాలా కేర్ తీసుకుంటారు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ‘పూజా హెగ్డే’ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి అంటూ ఇండస్ట్రీని కొన్నాళ్లు ఊపేసారు. ప్రస్తుతం సామ్ చేసిన స్పెషల్ నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యింది. బన్నీతో కలిసి సమంత వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్‌లో సమంత కొంచెం హాట్ లుక్స్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది.
Samantha : చిన్నారి సాంగ్ వీడియో.. సమంత ట్వీట్
ఈ సాంగ్ పై ఇప్పటికే చాలా ఫన్నీ వీడియాలు వచ్చాయి. సెలెబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు, అమ్మాయిలు, అబ్బాయిలు తెగ వీడియోలు చేసేస్తూ పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ తల్లి తన పాపకు ఇంగ్లీష్ పదాలు నేర్పిస్తుంది. ‘WHO’ హూ అంటూ చదివిస్తుండగా.. ఆ చిన్నారి క్యూట్‌గా ఊ అంటావా మామ.. ఊఊ అంటావా’ మామ అంటూ సాంగ్ పాడేస్తుంది. ఈ వీడియోను అల్లు ప్రశాంత్ ట్విట్టర్‌లో షేర్ చేయగా స్పందించిన సమంత ‘DEAD (చచ్చిపోయా) అంటూ లవ్ సింబర్స్ పెట్టి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నారి క్యూట్ డైలాగ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Dead ???????????? https://t.co/5qKWCU1pxo
— Samantha (@Samanthaprabhu2) December 27, 2021