Samantha : స‌మంత .. అక్కినేని ఫ్యామిలీకి దూరంగా.. ద‌గ్గుబాటు ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గా.. కార‌ణం ఇదేనా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :19 December 2021,7:00 pm

Samantha : టాలీవుడ్‌లో స‌మంత వ్య‌వ‌హారం ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. ఆమె ఫ్యాన్స్‌కు ఆమె చేస్తున్న ప‌నులు షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఆమె నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత అక్కినేని ఫ్యామిలీ మీద బాగానే కోపంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో మిగ‌తా అంద‌రి గురించి ఏదో ఒక పోస్టులో నెట్టింట్లో సంద‌డి చేస్తున్న స‌మంత‌.. నాగ‌చైత‌న్య గురించి మాత్రం ఎలాంటి మాట మాట్లాడ‌ట్లేదు. దీంతో ఆమె వ్య‌వ‌హారం ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. స‌మంత ఏంటీ ఇలా చేస్తోంది అని చాలామంది షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌నే చేసింది స‌మంత‌.

స‌మంత ద‌గ్గుబాటి కుటుంబానికి మాత్రం చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటోంది. మొన్న‌టికి మొన్న హీరో రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌ని గురించి ప్ర‌త్యేక‌మైన పోస్టు పెట్టింది స‌మంత‌. ఈ పోస్టు నెట్టింట్లో చాలా వైర‌ల్ గా మారింది. అయితే ఇప్పుడు రాణా భార్య మిహిక పుట్టిన రోజు సందర్భంగా కూడా స‌మంత మ‌రో స్పెష‌ల్ పోస్టుతో వార్త‌ల్లోకి ఎక్కింది. ఇక్క‌డే చాలామందికి ఓ డౌట్ వ‌స్తోంది. ఎందుకంటే వేరే వాళ్ల బ‌ర్త్ డేల‌కు ఇలా పోస్టులు పెడుతున్న స‌మంత నాగ‌చైత‌న్య విష‌యంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుంది.

samantha unintelligible samantha things

samantha unintelligible samantha things

Samantha : మిహిక బ‌ర్త్ డేకు స్పెష‌ల్ పోస్టు..

నాగ‌చైత‌న్య బ‌ర్త్ డేకు మాత్రం ఎలాంటి విషెస్ చెప్ప‌కుండా ఉండిపోయింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక మిహిక బ‌ర్త్ డే సంద‌ర్భంగా మాత్రం ఆమెకు ఎక్క‌డ ఉంటే అక్క‌డ మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొంది. ఇక హీరో వెంక‌టేశ్ కూతురు ఆశ్రిత కూడా ఇలాగే స‌మంత‌తో చాలా క్లోజ్ గా ఉంటోంది. కానీ ఇండ‌స్ట్రీలో ద‌గ్గుబాటి, అక్కినేని కుటుంబాలు చాలా స‌న్నిహితంగా ఉంటాయి. పైగా నాగ‌చైత‌న్య‌కు వెంక‌టేశ్ మామ కూడా. మ‌రి వారితో విభేదాలు పెంచుకుని వీరితో సంబంధాలు కొన‌సాగించ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి