Samantha : ‘ అవి ‘ లేకపోతే ఉండలేకపోతోంది .. అంతగా ఎడిక్ట్ అయిపోయింది ఏంటి సమంత !!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,10:20 am

Samantha : తెలుగులో ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటుంది. ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన సమంత ఆ తర్వాత శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ రోజున ప్రెస్మీట్లో పాల్గొంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తుంది. ఇటీవల సమంత కనిపించిన ప్రతిసారి రుద్రాక్ష మాలతో ఆధ్యాత్మిక చింతనతో కనిపిస్తుంది.

శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో సమంత చేతిలో రుద్రాక్ష జప మాల చూసిన అందరూ షాక్ అయిపోయారు. మానసిక ప్రశాంతత కోసం సమంత తనతో ఎప్పుడు రుద్రాక్ష జపమాలను ఉంచుకున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలో కూడా చేతికి జపమాల కనిపించింది. ఆధ్యాత్మిక ఆలోచనలతో ఎక్కువసేపు గడుపుతున్న కారణంగా సమంత తన అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Sam wears japa beads like a band on her arm working out in the gym

జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో కూడా చేతికి జపమాలను ధరించింది. దీంతో సమంత ఎంత ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుందో అర్థమవుతుంది. దీంతో చేతికి జపమాలను ధరించి ఉన్న ఫోటోలు చూసి జనాలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక సమంత ఇటీవల శాకుంతల సినిమా పూర్తి చేసుకుంది ఈ సినిమా వచ్చేనెల 17వ తారీఖున భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ జనాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. మరోవైపు విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి