Samantha : స‌మంత ఎత్తుకున్న చిన్నారి ఎవ‌రు.. ఎంత ముద్దుగా ఉన్నారు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 16 March 2022, 9:30 pm

Samantha : అక్కినేని కోడ‌లిగా, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత గ‌త ఏడాది అక్టోబర్‌లో చైతూకి విడాకులు ఇచ్చి సెన్సేష‌న్‌గా మారింది. సమంత, నాగచైతన్య ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. మ్యారేజ్‌ తర్వాత కూడా ఎలాంటి గ్యాప్‌ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సమంత, చైతూ. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సమంత తన ట్విట్టర్‌, ఇన్‌స్టాలో నేమ్‌ ఛేంజ్‌ చేయడంతో అంద‌రిలో అనుమానాలు మొద‌ల‌య్యాయి. సమంత తన ట్విట్టర్‌, ఇన్‌స్టా పేరులో `అక్కినేని` తీసేసి కేవలం `ఎస్‌`గా మార్చింది. దీంతో చైతూతో విభేదాలు తలెత్తాయా? అనే రూమర్ ఊపందుకుంది.

వీటిపై అక్టోబ‌ర్ 2న క్లారిటీ వ‌చ్చింది. చైతూ, స‌మంత ఇద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విష‌యం విని అభిమానులు షాక్ అయ్యారు. విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత చైతూ, స‌మంత ఒక‌రినొక‌రు ప‌ట్టించుకోకుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళుతున్నారు. చిలుకా గోరెంకలుగా, అన్యోన్య దంపతులుగా ఉండే వీరిద్దరు విడిపోవడం నిజంగా చాలా బాధాకరం. వారిద్దరు క‌ల‌వాల‌ని అభిమానులు క‌ల‌లుగంటున్న అది అసంభ‌వం అనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే విడాకుల త‌ర్వాత శాకుంత‌లం డైరెక్టర్ స‌మంత‌- చైతూ జంట గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది.సమంత, నాగచైతన్యల అసలు ప్లాన్‌ వేరే ఉంద‌ని చెప్పిన ఆమె, `శాకుంతలం` సినిమా షూటింగ్‌ తర్వాత వాళ్లు మరో ప్లాన్‌ చేసుకున్నారట.

samantha with cute childpic viral

samantha with cute childpic viral

Samantha : పిల్ల‌లంటే అంత ఇష్ట‌మా?

సమంత, చైతూ పిల్లలు కనేందుకు ప్లాన్‌ చేశారని తెలిపింది. ఆ సీక్రెట్‌ ప్లాన్‌లో భాగంగానే సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నారట. మొదట `శాకుంతలం` సినిమాని కూడా ఒప్పుకోలేదని, కానీ కథ విన్నాక, బాగా నచ్చి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఆ తర్వాత పిల్లలు కనాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది నీలిమ గుణ. పిల్ల‌లంటే ముందు నుండి ఇష్ట‌ప‌డిన స‌మంత పిల్ల‌ల్ని క‌న‌కుండా ఎందుకు విడాకులు ఇచ్చింద‌నేది మిస్ట‌రీగా మారింది. అయితే తాజాగా స‌మంత ఓ చిన్నారిని ఎత్తుకొని క్యూట్ ఫోజులు ఇచ్చింది. ఈ పిక్ అభిమానుల‌ని తెగ ఆక‌ట్టుకుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి