Samantha : బుల్లి నిక్కర్లో సమంత.. వారితో కలిసి అక్కడికి చెక్కేస్తోన్న సామ్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 27 October 2021, 8:59 am

Samantha సమంత మళ్లీ మొదలుపెట్టేసింది. నాగ చైతన్యతో విడాకుల విషయాన్నని పూర్తిగా పక్కన పెట్టేసింది. మొన్నటి వరకు తీర్థ యాత్రల్లో మునిగి తేలింది. ఛార్ ధామ్ యాత్ర అంటూ పుణ్యక్షేత్రాలను చుట్టి వచ్చింది. హిమాలయాల అద్బుతాలు, రహస్యాలను చూసి ఉబ్బితబ్బిబ్బైపోయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్,బద్రీనాథ్ అంటూ అన్నింటిని చూసి వచ్చింది. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేసి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం రూటు మార్చేసింది.

Samantha Ruth Prabhu With Sadhna And Preetham

Samantha Ruth Prabhu With Sadhna And Preetham

తాజాగా సమంత షాక్ ఇచ్చింది. బుల్లి నిక్కర్ ధరించి ఎయిర్ పోర్టులో కనిపించింది. అది కూడా తన ఫ్రెండ్స్ ప్రీతమ్ జుకల్కర్, సాధన సింగ్‌లతోనే. ఇన్ని రోజులు శిల్పా రెడ్డితో కలిసి ఉన్న సమంత ఇక ఇప్పుడు ఈ ఇద్దరితో ఉండబోతోంది. అయితే కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే ప్రీతమ్ పక్కన ఉండాల్సిన సామ్.. సాధన పక్కన కూర్చుంది. అంటే ఫోటోలకు పోజులు ఇస్తున్నామని అలా దూరంగా నిల్చున్నారో ఏమో గానీ కాస్త మార్పు అయితే కనిపిస్తోంది.

Samantha వెకేషన్‌లో సమంత

Samantha Ruth Prabhu With Sadhna And Preetham

Samantha Ruth Prabhu With Sadhna And Preetham

ఇక ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు అనేది పర్ఫెక్ట్‌గా చెప్పలేదు. కానీ విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పేశారు. అది షూటింగ్ నిమిత్తమా? ఎంజాయ్ చేయడానికా? అనేది క్లారిటీగా తెలియదు. కానీ వారు మాత్రం వెకేషన్స్‌కు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఎక్కడికి వెళ్తున్నారనే అప్డేట్ మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా సామ్ మాత్రం ఒక్క చోట నిలకడగా ఉండటం లేదు. అలా ప్రపంచాన్ని చుట్టి వచ్చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి