samyuktha hegde injured
Samyuktha Hegde : సాధారణంగా హీరోలు స్టంట్స్ చేస్తూ అభిమానులని అలరించే ప్రయత్నం చేస్తుంటారు. కాని ఈ మధ్య హీరోయిన్స్ కూడా స్టంట్స్ చేస్తూ అబ్బురపరుస్తున్నారు. అయితే హీరోయిన్స్ స్టంట్స్ చేసే సమయంలో ఒక్కోసారి దారుణమైన ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా కన్నడ నాట వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య అనే పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు మరో తెలుగు సినిమా అవకాశం దక్కలేదు. కానీ వరుసగా తమిళ, కన్నడ సినీ అవకాశాలు దక్కించుకుని వరుస సినిమా షూటింగ్స్ తో ముందుకు వెళుతోంది.
ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న కన్నడ మూవీ క్రీమ్ షూటింగ్‌లో భాగంగా ఫైట్ సీన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా రౌడీలను కొట్టే సందర్భంలో స్టంట్ చేసే క్రమంలో ఆమె కాలికి గాయమైంది. వెంటనే ఆమెను మూవీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, మేకింగ్ వీడియోను ఈ అందగత్తె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వరుసగా స్టంట్స్ కొట్టే సమయంలో కాలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే చిత్ర యూనిట్ ఆమె వద్దకు వచ్చి హుఠాహుఠినా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. షూటింగ్ సమయంలో సంయుక్తా మీనన్ ఎలా గాయపడిందో ఆడియెన్స్ కు తెలియజేసేందుకు మేకింగ్ వీడియోను షేర్ చేసింది.
samyuktha hegde injured
వీడియో చూసిన తన అభిమానులు, ఆడియెన్స్ ను త్వరగా కోలుకోవాలని దేవుడి ప్రార్థిస్తున్నారు. వీడియో షేర్ చేస్తూ సంయుక్తా ఇలా కామెంట్స్ చేసింది. టేకింగ్ లో తనకు గాయమైనా.. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఫైట్ చూసి ప్రేక్షకులు ఖుషీ అవుతారని తెలిపింది. తెలుగులో ఒక్క చిత్రంలోనే నటించిన ఈ బ్యూటీ కన్నడ, తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గాయం వల్ల తాను బాధపడుతూ ఇంటికే పరిమితమైనా సరే సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ సీన్ చూసి కచ్చితంగా ప్రేక్షకులు తనను మెచ్చుకుంటారని తనకు నమ్మకం ఉందంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.