Sarayu Recalls Ariyana Body Shaming Comments In Bigg Boss Non Stop
Bigg Boss Sarayu : బిగ్ బాస్ షో కంటే సరయు ముందుగానే ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో సరయు మాట్లాడే పిచ్చి మాటలు, అడల్ట్ బూతుల గురించి అందరికీ తెలిసిందే. అందరూ ఏవగించుకునేలా ఆ మాటలుంటాయి. సరయు అంటే అందరికీ ఓ హడల్. ఆమెను ఎవ్వరూ అంతగా ఇష్టపడేవారు కాదు. ఆమెకు విపరీతమైన నెగెటివిటీ ఉండేది. ఆదే ఆమెకు బిగ్ బాస్ ఇంట్లో దెబ్బ కొట్టేసింది. సరయు బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. మొదటి వారంలోనే సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.అయితే మళ్లీ నాన్ స్టాప్ షోలోనూ సరయుకు అవకాశం వచ్చింది. అయితే ఈ ఓటీటీలో సరయు ఇంకెంత రచ్చ చేస్తుందో అని అనుకున్నారు.
కానీ సరయు మాత్రం తన మార్క్ చూపించుకోలేకపోయింది. ఎప్పుడూ ఏడుపు మొహంతోనే కనిపించేది. హమీద, అరియానా, అషూ ఇలా అందరితో వాగ్వాదానికి దిగుతూ వచ్చేది. ఇక ఒక గొడవ మాత్రం నానా రచ్చకు దారి తీసింది. అరియానా అన్న ఒక మాట సరయుని తెగ బాధపెట్టేసింది. నువ్ నడుస్తుంటే భూకంపం వచ్చినట్టుంది.. నాకు భయం వేస్తుంది అని తన భారీకాయం మీద కౌంటర్లు వేసింది.అది కాస్త కామెడీగానే అన్నట్టుగా సరయు సీరియస్ అయింది. చాలా బాధపడింది. ఈ విషయాన్ని నాగార్జున వద్ద కూడా ప్రస్థావించింది. తనను జీరో సైజ్ అని, చాలా బాగుంటావ్ అని, నడుము మీద కామెంట్లు చేస్తుందని నేను కూడా అన్నాను అని అరియానా కవర్ చేసేసుకుంది.
Sarayu Recalls Ariyana Body Shaming Comments In Bigg Boss Non Stop
నేను పాజిటివ్‌గా అంటే నువ్ మాత్రం నెగెటివ్‌గా అంటున్నావ్ అని సరయు చెప్పుకొచ్చింది. అయితే సరయు బయటకు వచ్చింది. అరియానా చివరి వరకు ఉంది. మొన్న జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లోనూ ఈ గొడవ మళ్లీ ప్రస్థావనకు వచ్చింది.అయితే అరియానాను మాత్రం సరయు ఇంకా క్షమించలేదని అర్థమైంది. అసలు అరియానాను తన మైండ్‌లోంచి డిలీట్ చేశానని, తనను పట్టించుకోవడం లేదని అరియానా గురించి సరయు చెప్పింది. అయితే తాజాగా సరయు ఓ పోస్ట్ చేసింది. ఒకరిని నల్లగా ఉన్నావ్, లావుగా ఉన్నావ్ అని అనొద్దంటూ ఆ పోస్ట్ చేసింది. అంటే సరయు మాత్రం ఇంకా అరియానా మాటలను మర్చిపోలేకపోతోందన్న మాట.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.