Sarkaru Vaari Paata : సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్స్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. సర్కారు వారి పాట మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలైన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి కాస్త భిన్నమైన టాక్ ను అందుకుంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు గత ఏడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి ఒక విధంగా పాజిటివ్ టాక్ రావడంతో ఘట్టమనేని అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు..కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ ఉండబోతుందని వారు చిత్ర యూనిట్‌తో ఒప్పందం చేసుకున్నారట.
‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రైమ్ దాదాపు రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. కేవలం తెలుగుకే కాకుండా.. హిందీ మిగతా భాషల్లో ఈ సినిమా డబ్ చేసి స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనతోనే ఇంత భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు పాటు నేత విజయ సాయి రెడ్డి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాలకు అంటే జూన్ 10న స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన చేయనున్నారు. .
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.