Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట సోలో అనుకున్నారా.. అంత సీన్ లేదు.. ?

Authored By vamana sai | The Telugu News | Published on: February 28, 2021, 10:53 am

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మహేష్ బాబు కెరీర్ లో రాబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాట కాగా ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే నెలరోజుల దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ సినిమా గోవా లో ఒక సాంగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లేదా అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమాలో మహేష్ బాబు కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది.

sarkaru-vari-pata is not a solo movie

Sarkaru Vaari Paata is not a solo movie

జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. యూనివర్సల్ పాయింట్ తో పరశురాం రూపొందిస్తుండగా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. అయితే ఈ ఇయర్ దాదాపు భారీ సినిమాలన్ని రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఈ ఏడాదిలో కాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలోనే సర్కారు వారి పాట సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. చెప్పాలంటే పెద్ద సినిమాలలో సొలోగా బరిలో దిగుతుందని భావించారు.

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట కి చుక్కెదురైనట్టే అని చెప్పుకుంటున్నారు..?

కాని అంత సీన్ లేదని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాటకి పోటీగా డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ ల పీరియాడికల్ సినిమా, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – త్రివిక్రం ల పాన్ ఇండియన్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా ల లూసీఫర్ తెలుగు రీమేక్.. లాంటి భారీ సినిమాలే 2022 సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇయర్ లో ఉన్న రాధే శ్యాం, ఆచార్య, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలను దాటుకొని వచ్చే ఏడాదిలో సోలోగా వద్దామనుకున్న సర్కారు వారి పాట కి చుక్కెదురైనట్టే అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి 2022 లో సర్కారు వారి పాటకి ఏ ఏ సినిమాలు పోటీగా నిలుస్తాయో.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp