Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు గత కొన్నేళ్ళుగా వరుస హిట్స్‌తో మంచి దూకుడు మీదున్నాడు. మధ్యలో ఓ ఫ్లాప్ తప్ప మిగతా సినిమాలన్ని మహేశ్ ఖాతాలో హిట్స్‌గా బ్లాక్ బస్టర్స్‌గా చేరాయి. గత చిత్రం సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ వసూళ్ల సునామీని సృష్ఠించింది. అయితే, ఆ తర్వాత కరోనా ప్యాండమిక్ వల్ల మూడేళ్ళ గ్యాప్ వచ్చింది. అయితే, ఈ మూడేళ్ళ గ్యాప్‌ను ఒకే ఒక్క సినిమాతో ఫుల్ ఫిల్ చేయాలని పక్కాగా ప్లాన్‌తో వస్తున్నాడు మహేశ్. గీత గోవిందం సినిమాతో క్లాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు పరశురాం.
ఆయన దర్శకత్వంలో ఇప్పుడు నటించిన సర్కారు వారి పాట సినిమా అతి త్వరలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన హడావుడి అంతగా కనిపించలేదు. దాంతో సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థలు లైట్ తీసుకుంటున్నాయా అంటూ ప్రచారం జరిగింది. కానీ, తాజాగా చిత్రబృందం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా దర్శకుడు పరశురాం సర్కారు వారి పాట సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ డైలాగులు మహేశ్ నోట వినిపించడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్ గా ఉంది. పరశురాం రాసిన డైలాగులకు ట్రైలరే దద్దరిల్లిపోయింది.
దాంతో ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని మహేశ్ అభిమానులే కాదు, ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం గతంలో మహేశ్ బాబు నటించిన దూకుడు, ఆగడు సినిమాల తరహాలోనే సర్కారు వారి పాటి థియేట్రికల్ ట్రైలర్ ఉందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అదే ఫ్లేవర్ ట్రైలర్‌లో కనిపించింది. అందుకే, దూకుడు సినిమా మాదిరిగా ఇండస్ట్రీ హిట్ అయితే పర్లేదు గానీ, ఆగడు సినిమాల ఆగకుండా అడ్రస్ లేకుండా పోతే మాత్రం ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్‌మెంట్ తప్పదంటున్నారు. ట్రైలర్‌లో ఉన్న డైలాగులు, మహేశ్ – కీర్తి సురేశ్‌ల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్ చూస్తే దూకుడు, ఆగడు సినిమాలో మహేశ్, సమంత, తమన్నాలతో చేసిన రొమాన్సే గుర్తొస్తోంది. విలన్స్‌లతో ఫైట్స్ మైండ్‌లో మెదులుతున్నాయి. అయితే, ఈ సర్కారు వారి పాట సబ్జెక్ట్ పూర్తిగా కొత్తది..కాబట్టి బాక్సాఫీసులు బద్దలవడం ఖాయం అనేది ఇండస్ట్రీ వర్గాలు, చిత్రబృందం చెబుతున్న మాట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.