Mahesh Babu : దూకుడు, ఆగడు సినిమాలను గుర్తు చేసిన సర్కారు వారి పాట ట్రైలర్..ఇదేంటీ..?

Authored By vamana sai | The Telugu News | Published on: May 4, 2022, 1:00 pm

Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు గత కొన్నేళ్ళుగా వరుస హిట్స్‌తో మంచి దూకుడు మీదున్నాడు. మధ్యలో ఓ ఫ్లాప్ తప్ప మిగతా సినిమాలన్ని మహేశ్ ఖాతాలో హిట్స్‌గా బ్లాక్ బస్టర్స్‌గా చేరాయి. గత చిత్రం సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ వసూళ్ల సునామీని సృష్ఠించింది. అయితే, ఆ తర్వాత కరోనా ప్యాండమిక్ వల్ల మూడేళ్ళ గ్యాప్ వచ్చింది. అయితే, ఈ మూడేళ్ళ గ్యాప్‌ను ఒకే ఒక్క సినిమాతో ఫుల్ ఫిల్ చేయాలని పక్కాగా ప్లాన్‌తో వస్తున్నాడు మహేశ్. గీత గోవిందం సినిమాతో క్లాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు పరశురాం.

ఆయన దర్శకత్వంలో ఇప్పుడు నటించిన సర్కారు వారి పాట సినిమా అతి త్వరలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన హడావుడి అంతగా కనిపించలేదు. దాంతో సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థలు లైట్ తీసుకుంటున్నాయా అంటూ ప్రచారం జరిగింది. కానీ, తాజాగా చిత్రబృందం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు పరశురాం సర్కారు వారి పాట సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ డైలాగులు మహేశ్ నోట వినిపించడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్‌ గా ఉంది. పరశురాం రాసిన డైలాగులకు ట్రైలరే దద్దరిల్లిపోయింది.

Sarkaru vaari paata trailer is released

Sarkaru vaari paata trailer is released

Mahesh Babu : సర్కారు వారి పాట సబ్జెక్ట్ పూర్తిగా కొత్తది..కాబట్టి బాక్సాఫీసులు బద్దలవడం ఖాయం..

దాంతో ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని మహేశ్ అభిమానులే కాదు, ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం గతంలో మహేశ్ బాబు నటించిన దూకుడు, ఆగడు సినిమాల తరహాలోనే సర్కారు వారి పాటి థియేట్రికల్ ట్రైలర్ ఉందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అదే ఫ్లేవర్ ట్రైలర్‌లో కనిపించింది. అందుకే, దూకుడు సినిమా మాదిరిగా ఇండస్ట్రీ హిట్ అయితే పర్లేదు గానీ, ఆగడు సినిమాల ఆగకుండా అడ్రస్ లేకుండా పోతే మాత్రం ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్‌మెంట్ తప్పదంటున్నారు. ట్రైలర్‌లో ఉన్న డైలాగులు, మహేశ్ – కీర్తి సురేశ్‌ల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్ చూస్తే దూకుడు, ఆగడు సినిమాలో మహేశ్, సమంత, తమన్నాలతో చేసిన రొమాన్సే గుర్తొస్తోంది. విలన్స్‌లతో ఫైట్స్ మైండ్‌లో మెదులుతున్నాయి. అయితే, ఈ సర్కారు వారి పాట సబ్జెక్ట్ పూర్తిగా కొత్తది..కాబట్టి బాక్సాఫీసులు బద్దలవడం ఖాయం అనేది ఇండస్ట్రీ వర్గాలు, చిత్రబృందం చెబుతున్న మాట.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp