Home » Entertainment » Secrets You May Not Know About Ramesh Babus Family
Entertainment

Ramesh Babu : రమేశ్ బాబు ఫ్యామిలీ గురించి మీకు తెలియని సీక్రెట్స్..!

Authored By
mallesh
The Telugu News | Updated on: January 9, 2022 1:27 pm
Advertisement

Ramesh Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ మధ్యలో వరుస విషాదాలు సంభవించాయి. ఒకరివెనుక ఒకరు దర్శకులతో పాటు సీనియర్ నటులు, కమెడియన్స్ మృతి చెందారు. 2021లో కూడా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పాటల పూదోట సిరివెన్నెల సీతారామశాస్త్రీ, ఎస్పీ బాలు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇక కొత్త ఏడాది 2022 ప్రారంభంలోనే సూపర్ కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ వార్త సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు అభిమానులను ఒకింత కలవరానికి గురి చేసింది. గత కొంతకాలంగా రమేశ్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తెలిసింది. శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

Ramesh Babu : రమేశ్ బాబు పర్సనల్ లైఫ్

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రమేశ్ బాబు నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత నిర్మాతగా మారి తమ్ముడు మహేష్ బాబుతో పలు సినిమాలను నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ -ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. అందులో పెద్దవాడు రమేష్ బాబు. ఆయన తర్వాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, చివరగా ప్రియదర్శిని ఉన్నారు.

secrets you may not know about ramesh babu family

Advertisement

అయితే, తమ్ముడు మహేష్ బాబు కంటే ముందే ఇండస్ట్రీలోకి వచ్చిన రమేశ్ బాబు అల్లూరి సీతారామరాజు మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల తర్వాత మళ్లీ ఆ వైపు చూడలేదు. రమేశ్ బాబుకు కుటుంబం ఉంది. కానీ వారు ఎక్కువగా బయట కనిపించరు. రమేష్ బాబుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవిత భాగస్వామి పేరు మృదుల, అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. వీరు కూడా ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. బాబాయ్ సినిమా, అవార్డు ఫంక్షన్లలో కూడా కనిపించరు. రమేశ్ బాబు వ్యసనాలకు బాగా అలవాటు పడిపోవడం వలన కాలేయ చెడిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా బాధపడుతూ కన్నుమూశారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి