
See How Ali Reacted On Harish Shankar Comments
Harish Shankar : తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు అందరికీ సుపరిచితుడే. డైరెక్టర్ తేజ చిత్రాలలో ఎక్కువ అవకాశాలు అందుకోవటం జరిగింది. ప్రేక్షకులలో తనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత… పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన కూడా అవకాశాలు అందుకున్నాడు. అనంతరం జబర్దస్త్ కామెడీ షో స్టార్టింగ్ లో టీం లీడర్ గా.. షో సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇప్పుడు దర్శకుడిగా వేణు “బలగం” అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మించడం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
See How Ali Reacted On Harish Shankar Comments
అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు శ్రీరామ్, పరశురాం, హరీష్ శంకర్ హాజరయ్యారు. ఇంకా ఇదే కార్యక్రమానికి కమెడియన్ ఆలీ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ…”బలగం” సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజును పొగిడారు. ఇక ఇదే సమయంలో ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారని తెలిపారు. కమర్షియల్ లేదా మాస్ సినిమా అని కేవలం ఇండస్ట్రీ, మీడియా ఆలోచిస్తాయి. కానీ ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని చూస్తారు. బలగం సినిమా మంచిది కాబట్టే అందరం ఈ వేడుక లో ఉన్నాం.
అప్పట్లో శంకరాభరణం, సాగర సంగమం సినిమాలకు బళ్ళు కట్టుకుని జనాలు వెళ్లారు. ఇక వేస్తే రాలని జనం. సీతాకోక సినిమాకి కూడా ఆ రీతిగానే జనాలు ఆదరించారు ఆలీ గారు కూడా ఇక్కడే ఉన్నారు అని ఆయనపై హరీష్ షాకింగ్ కామెంట్ చేశారు. సీతాకోక సినిమాలో సుమోలు గాల్లోకి ఎగరలేదు… రక్తపాతాలు ధారలేదు. కానీ ఆ సినిమాలు కూడా విపరీతమైన మాస్ ప్రేక్షకులు చూడటం జరిగింది. సాగర సంగమం తన ఆల్ టైం ఫేవరెట్ సినిమా అని.. ఆ సినిమా పోస్టర్ మాత్రమే తన ఆఫీసులో ఉంటుందని హరీష్ శంకర్ తనదైన శైలిలో బలగం సినిమా సక్సెస్ పై స్పీచ్ ఇచ్చారు. దర్శకుడు వేణు తన మూలాలను మర్చిపోకుండా.. మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని హరీష్ తెలియజేశారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.