Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పూర్తిగా ఫీమేల్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. సమంతను ఇప్పటి వరకూ కనిపించని విధంగా, చాలా పవర్‌ఫుల్, ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌లో దర్శకుడు క‌మ్ముల చూపించనున్నాడని టాక్.

Samantha స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : ఇంట్రెస్టింగ్ బ‌జ్..

ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచే విధంగా ఈ కథను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ‘ఆనంద్’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘లవ్ స్టోరి’ వంటి ఫీల్‌గుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్, ఈసారి మామూలుగా కాకుండా భిన్నంగా ప్రయత్నించనున్నాడని సమాచారం. ఈ సినిమాతో సమంత కెరీర్‌లో మరో శిఖరాన్ని అధిరోహించనున్నదనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.

ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శేఖర్, సమంత కాంబినేషన్‌కు ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆసక్తిగా మారనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది