Home » Entertainment » Sekhar Master Not Appears In Dhee Show
Entertainment

Sekhar master : అందుకే దూరంగా ఉన్నాడా?.. శేఖర్ మాస్టర్‌కు ఏమైంది!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: March 26, 2021, 9:30 am
Advertisement

Sekhar master : ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై, వెండితెరపై శేఖర్ మాస్టర్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. అందుకే కొన్ని సార్లు బుల్లితెర షోలకు డుమ్మా కొడుతుంటారు. సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తుండటం వల్ల అప్పుడప్పుడు షోలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. అయితే శేఖర్ మాస్టర్‌కు ఆ మధ్య కరోనా సోకడంతో ఓ నెల రోజుల పాటు ఢీ షోలో కనిపించలేదు. శేఖర్ మాస్టర్‌కు బదులు బాబా భాస్కర్ వచ్చి ఎంటర్టైన్ చేశాడు.

Advertisement

ఇప్పుడు శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్, ఢీ షోల్లో సందడి చేస్తున్నాడు. అయితే రెండు వారాల నుంచి శేఖర్ మాస్టర్ ఢీ షోలో కనిపించడం లేదు. గత వారం రాబర్ట్ హీరో వచ్చాడు. ఈ సారి మరో కొరియోగ్రాఫర్ వచ్చాడు. అయితే శేఖర్ మాస్టర్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే ఢీ షోకు హాజరు కాలేకపోతోన్నట్టు తెలుస్తోంది. కానీ అదే సమయంలో కామెడీ స్టార్స్ షోలోనూ కనిపిస్తున్నాడు. అక్కడ కనిపించి ఇక్కడ కనిపించకపోవడంతో నెటిజన్లు డైలామాలో పడ్డారు.

Advertisement

Sekhar master : శేఖర్ మాస్టర్‌కు ఏమైంది!

అయితే ఆ కామెడీ స్టార్స్ షోను ముందుగా షూట్ చేశారని అందుకు అందులో కనిపిస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఢీ షోలో న్యాయ నిర్ణేతగా శేఖర్ మాస్టర్ లేని లోటు ఇట్టే కనిపిస్తుంటుంది. శేఖర్ మాస్టర్ వేసే పంచ్‌లు, సుధీర్-ఆదిలను ఏడిపించే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మొత్తానికి శేఖర్ మాస్టర్ ఈ మధ్య దుబాయ్‌లో రంగ్ దే సాంగ్స్ షూట్ చేశాడు. అక్కడే దుబాయ్ వీధుల్లో తిరుగుతూ చేసిన వీడియో కూడా బాగానే క్లిక్ అయింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి