Sekhar master : అందుకే దూరంగా ఉన్నాడా?.. శేఖర్ మాస్టర్‌కు ఏమైంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sekhar master : అందుకే దూరంగా ఉన్నాడా?.. శేఖర్ మాస్టర్‌కు ఏమైంది!

Sekhar master : ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై, వెండితెరపై శేఖర్ మాస్టర్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. అందుకే కొన్ని సార్లు బుల్లితెర షోలకు డుమ్మా కొడుతుంటారు. సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తుండటం వల్ల అప్పుడప్పుడు షోలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. అయితే శేఖర్ మాస్టర్‌కు ఆ మధ్య కరోనా సోకడంతో ఓ నెల రోజుల పాటు ఢీ షోలో కనిపించలేదు. శేఖర్ మాస్టర్‌కు బదులు బాబా […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :26 March 2021,9:30 am

Sekhar master : ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై, వెండితెరపై శేఖర్ మాస్టర్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. అందుకే కొన్ని సార్లు బుల్లితెర షోలకు డుమ్మా కొడుతుంటారు. సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తుండటం వల్ల అప్పుడప్పుడు షోలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. అయితే శేఖర్ మాస్టర్‌కు ఆ మధ్య కరోనా సోకడంతో ఓ నెల రోజుల పాటు ఢీ షోలో కనిపించలేదు. శేఖర్ మాస్టర్‌కు బదులు బాబా భాస్కర్ వచ్చి ఎంటర్టైన్ చేశాడు.

ఇప్పుడు శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్, ఢీ షోల్లో సందడి చేస్తున్నాడు. అయితే రెండు వారాల నుంచి శేఖర్ మాస్టర్ ఢీ షోలో కనిపించడం లేదు. గత వారం రాబర్ట్ హీరో వచ్చాడు. ఈ సారి మరో కొరియోగ్రాఫర్ వచ్చాడు. అయితే శేఖర్ మాస్టర్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే ఢీ షోకు హాజరు కాలేకపోతోన్నట్టు తెలుస్తోంది. కానీ అదే సమయంలో కామెడీ స్టార్స్ షోలోనూ కనిపిస్తున్నాడు. అక్కడ కనిపించి ఇక్కడ కనిపించకపోవడంతో నెటిజన్లు డైలామాలో పడ్డారు.

Sekhar master : శేఖర్ మాస్టర్‌కు ఏమైంది!

అయితే ఆ కామెడీ స్టార్స్ షోను ముందుగా షూట్ చేశారని అందుకు అందులో కనిపిస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఢీ షోలో న్యాయ నిర్ణేతగా శేఖర్ మాస్టర్ లేని లోటు ఇట్టే కనిపిస్తుంటుంది. శేఖర్ మాస్టర్ వేసే పంచ్‌లు, సుధీర్-ఆదిలను ఏడిపించే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మొత్తానికి శేఖర్ మాస్టర్ ఈ మధ్య దుబాయ్‌లో రంగ్ దే సాంగ్స్ షూట్ చేశాడు. అక్కడే దుబాయ్ వీధుల్లో తిరుగుతూ చేసిన వీడియో కూడా బాగానే క్లిక్ అయింది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది