Pooja hegde : పూజా హెగ్డేపై ‘సెల్వమణి’ సెన్షేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja hegde : పూజా హెగ్డేపై ‘సెల్వమణి’ సెన్షేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్

Pooja hegde : ఒకే ఏడాది ముకుందా, ఒక లైలా కోసం సినిమాలోతో గ్రాండ్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్ తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. అయినా మళ్ళీ టాలివుడ్ లో దువ్వాడ జగన్నాథం సినిమాలో అవకాశం అందుకొంది. ఈ సినిమా కూడా చెప్పుకోవాల్సిన సక్సెస్ సాధించలేదు. […]

 Authored By govind | The Telugu News | Updated on :19 August 2021,3:40 pm

Pooja hegde : ఒకే ఏడాది ముకుందా, ఒక లైలా కోసం సినిమాలోతో గ్రాండ్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్ తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. అయినా మళ్ళీ టాలివుడ్ లో దువ్వాడ జగన్నాథం సినిమాలో అవకాశం అందుకొంది. ఈ సినిమా కూడా చెప్పుకోవాల్సిన సక్సెస్ సాధించలేదు. అయినా పూజా ని టాలీవుడ్ మేకర్స్ బాగా ఎంకరేజ్ చేశారు. మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.

selvamani sensational comments on pooja hegde

selvamani sensational comments on pooja hegde

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే ప్రభాస్ తో చేస్తున్న రాధే శ్యాం, అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచ్ లర్ సినిమాలు పూర్తి చేసింది. అలాగే త్రివిక్రం శ్రీనివాస్ – మహేష్ బాబు ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇలా చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఇలా తెలుగు తెరపై రాణిస్తూనే బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో విజయ్ 65వ సినిమాలో పూజా హీరోయిన్. సన్ పిక్చర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

selvamani sensational comments on pooja hegde

selvamani sensational comments on pooja hegde

Pooja hegde: పూజా హెగ్డే తీరుతో నిర్మాతలకు భారంగా మారుతోందట

అయితే ప్రస్తుతం పూజా హెగ్డే వ్యవహరిస్తున్న తీరుతో భారీగా ప్రొడక్షన్ ఖర్చు పెరగడమే గాక, నిర్మాతలకు భారంగా మారుతోందంటూ ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పూజా హెగ్డేపై రోజా భర్త, కోలీవుడ్ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో ఇద్దరు అసిస్టెంట్స్ మాత్రమే వెంట తీసుకొచ్చుకునే పూజా హెగ్డే ఇప్పుడు దాదాపు 12 మందిని తీసుకొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీరి ఖర్చు మొత్తం నిర్మాతల మీదే వేస్తుందట. ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం ఇలా 10 – 12 మందిని ఎవరూ వెంటబెట్టుకొని రావడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Pooja Hegde latest White Dress Pics

Pooja Hegde latest White Dress Pics

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది