Actress : 200 పైగా సినిమాలు చేసిన ఫేమ‌స్ న‌టి ఆ ఒక్క ప‌నితో చెడ్డ పేరు తెచ్చుకుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress : 200 పైగా సినిమాలు చేసిన ఫేమ‌స్ న‌టి ఆ ఒక్క ప‌నితో చెడ్డ పేరు తెచ్చుకుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :12 September 2022,9:00 pm

Actress : కొంద‌రు స్టార్స్ కెరీర్‌లో మంచి సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌రణ పొందుతుంటారు. అంతే కాదు వారి సినిమాల ద్వారా ఫుల్ ఫేమ‌స్ కూడా అవుతుంటారు. అలాంటి వారిలో సీనియ‌ర్ న‌టి గీత ఒక‌రు. 1978లో తమిళ సినిమా భైరవి చిత్రంలో తొలిసారిగా పరిచయమైంది. ఈ చిత్రంలో ఈమె రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించింది. 1986లో వచ్చిన మలయాళం సినిమా పంచాగ్నిలో ఈమె నటించింది . ఆ పాత్రలో గీత నటన ప్రేక్షకుల ఆదరణను పొందడమే కాక ది హిందూ దినపత్రిక ఈమెను మలయాళ సినిమా హీరోయిన్లలో ఒక మైలురాయిగా అభివర్ణించింది.

కన్నడ సినిమాలలో ఈమె రాజ్‌కుమార్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి పేరుమోసిన నటుల సరసన నటించింది. 1980వ దశకంలోను, 90వ దశకం మొదటిలోను ఈమె దక్షిణ భారతదేశపు అందమైన సినీతారలలో ఒకరిగా పలువురిచే గుర్తింపు పొందింది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి కన్నడలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోను ఈమె ప‌లు భాష‌ల‌లో న‌టించి మెప్పించింది. గీత‌ని చూస్తే తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తు ప‌డ‌తారు. తెలుగు పరిశ్రమ గుర్తింపుతో ఈమెకు బుల్లితెరలో బతుకుజట్కాబండి అనే కార్యక్రమంలో అవకాశం వచ్చింది.

senior actress geetha faced problem

senior actress geetha faced problem

Actress : ఒక్క ప‌ని వ‌ల‌న అలా అయింది..!

అందులో ఆమె ఎన్నో చిక్కుల్లో పడి విమర్శలకు గురైంది. అందులో ఒక కేసుకు సంబంధించి ఒక అమ్మాయిని విపరీతమైన తిట్లు తిట్టి మహిళా సంఘాలచే విమర్శింపబడింది. ఆమె ఆ అమ్మాయిని “లవ్ చేయడానికి నీకు సిగ్గు లేదా ఆమెకు పెళ్లి చేసి పడేయండి సన్ ఆఫ్ బిచ్” అంటూ ఎన్నో వివిధ రకాలైన తిట్లు తిట్టడం వల్ల ఆమె మీద ఒక్కసారిగా అందరూ విరుచుకుపడ్డారు. అప్పటినుంచి ఈమె ఆ షో నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో తల్లి పాత్రలు నటిస్తోంది. అయితే దాదాపు 200 సినిమాల‌ల‌లో మంచి పేరు తెచ్చుకున్న గీత కేవ‌లం త‌న నోటి దురుసు వ‌ల‌న చెడ్డ పేరు తెచ్చుకోవ‌ల‌సి వ‌చ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది