Senior Actress Raasi : ముగ్గురితో రాశి పెళ్లి పీట‌లెక్కిందా? ఆమె భ‌ర్త‌లెవ‌రో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: July 24, 2022, 9:00 pm

Senior Actress Raasi : సీనియ‌ర్ హీరోయిన్ రాశి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అప్ప‌ట్లో స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన రాశి స్పెష‌ల్ సాంగ్స్‌లోను సంద‌డి చేసింది. రాశి బాల‌న‌టిగా ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. ఆమె బాల్యంలో ఉన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌నా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో కూడా ఆమె సినిమాలు చేసింది. పెద్ద‌ల అంగీకారంతోనే ఆమె డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శ్రీనివాస్‌ను ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి ముందే మ‌రో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంది.

ప్ర‌స్తుతం బుల్లితెర మీద ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ జానకి కలగనలేదు సీరియ‌ల్‌లో రాశీ న‌టిస్తుంది. ఈ సీరియల్ మంచి కథతో కొనసాగుతూ ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇక అదే విధంగా ఈ సీరియల్ లో జ్ఞానంబ పాత్రలో నటిస్తున్న రాశి పాత్ర‌కి మంచి పేరు వ‌చ్చింది. అయితే రాశీ పెళ్లి విష‌యం అప్పుడ‌ప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంటాయి. మొదటి గా తమిళ్ ఇండస్ట్రీ డైరెక్టర్ అయిన అశోక్ సామ్రాట్ అనే వ్యక్తిని 18 ఏళ్ల వయసులోనే ప్రేమించారు. కానీ ఆ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

Senior Actress Raasi get married with three people

Senior Actress Raasi get married with three people

Senior Actress Raasi : మూడు పెళ్లిళ్లా?

అతను తన మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోవడంతో రాశి అతని నుంచి దూరం అయిపోయింది. ఇక ఆ తర్వాత మనసిచ్చి చూడు దర్శకుడు సురేష్ వర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతని నుంచి కూడా కొంత కాలానికే దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు దర్శక నిర్మాత అయిన శ్రీనివాస్ ని పెళ్లి చేసుకొని వారి వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నారు. కానీ శ్రీనివాస్ కారణంగా రాశి పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిందని వాటి నుంచి బయటపడేందుకు వెండితెరపై సినిమా ఆఫర్లు లేకపోవడంతో బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజ‌నిజాలు ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

Also read

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp