Jayamalini : సీనియర్ నటి జయమాలిని తొలిప్రేమ ఎవరితోనో తెలుసా? ఇన్నేళ్లకు బయటపడ్డ అసలు సీక్రెట్
Jayamalini : అలనాటి నటి జయమాలిని తెలుసు కదా. అప్పట్లోనే ఐటెం సాంగ్స్ లో నటించి తన అందంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందుకే.. జయమాలిని అంత ఫేమస్ అయింది. గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను అంటూ వచ్చిన ఐటెమ్ సాంగ్స్ గుర్తుండే ఉంటాయి కదా. అప్పట్లో తను ఒక క్రేజ్. జయమాలిని ఏ సినిమాలో అయినా ఉంది అంటే చాలు.. ఆమెను చూడటానికే జనాలు థియేటర్ కు వెళ్లేవారు.
senior heroine jayamalini first love with that actor
జయమాలిని అప్పట్లోనే ఇంత క్రేజ్ సంపాదించిందంటే మామూలు విషయం కాదు. నిజానికి జయమాలిని సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. తమిళ నటి రాజకుమారి.. జయమాలినికి మేనత్త అవుతుంది. తన మామయ్య టీఆర్ రామన్న దర్శకుడు. ఆర్ఆర్ ప్రొడక్షన్ పేరుతో చాలా సినిమాలను నిర్మించాడు. అలా జయమాలిని ఇండస్ట్రీకి పరిచయం అయింది. జయమాలిని నటించిన తొలి మూవీ ఆడదాని అదృష్టం. విఠలాచార్య దర్శకుడు. జయమాలినికి భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.
Jayamalini :ఆడదాని అదృష్టం సినిమాలో తొలిసారి ఐటెం సాంగ్ చేసిన జయమాలిని
ఐటమ్ సాంగ్స్ లో నటించే జ్యోతిలక్ష్మి తన సోదరే. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో స్థిరపడింది. తన సినిమాలలో అప్పటి సీనియర్ డైరెక్టర్ దాస్ అవకాశాలు ఇచ్చారు. జయమాలిని అందాన్ని చూసి అప్పట్లో పడిపోని వాళ్లు లేరు. చాలామంది తనకు ప్రపోజ్ చేశారు. కానీ.. జయమాలిని చివరకు పార్తిబన్ ను పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయింది. కానీ.. తను ఇండస్ట్రీలోకి వెళ్లిన కొత్తలోనే ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆయన కూడా ఒక నటుడే. అతడికి ఆకర్షితురాలు అయింది జయమాలిని. కానీ.. ఆయన ఎవరు.. ఆ హీరోతో ఏ సినిమాలో నటించిందో మాత్రం చెప్పలేదు. ఆ సీక్రెట్ మాత్రం అలాగే ఉండిపోయింది.
