jayanthi passes away : అలనాటి హీరోయిన్ జయంతి ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

jayanthi passes away : అలనాటి హీరోయిన్ జయంతి ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత

jayanthi passes away : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి తార, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయంతి కన్నుమూశారు jayanthi passes away. బెంగళూరులోని తన నివాసంలో జయంతి jayanthi passes away తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 76 ఏళ్లు. కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతితో తెలుగుతో పాటు.. కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో విషాదం నెలకొన్నది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని పలువురు సినీ ప్రముఖులు ఈసందర్భంగా […]

 Authored By gatla | The Telugu News | Updated on :26 July 2021,10:33 am

jayanthi passes away : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి తార, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయంతి కన్నుమూశారు jayanthi passes away. బెంగళూరులోని తన నివాసంలో జయంతి jayanthi passes away తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 76 ఏళ్లు. కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతితో తెలుగుతో పాటు.. కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో విషాదం నెలకొన్నది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని పలువురు సినీ ప్రముఖులు ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు.

senior heroine jayanthi passes away

senior heroine jayanthi passes away

500 కు పైగా సినిమాల్లో… jayanthi passes away

జయంతి సొంత ఊరు కర్ణాటకలోని బళ్లారి. తను మొదటిసారి కన్నడ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో 500 కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె.. తెలుగులో అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ సరసన కూడా నటించారు. తమిళంలో ఎంజీఆర్, రజనీకాంత్ సరసన కూడా నటించి మెప్పించారు.జయంతి 1945వ సంవత్సరంలో జన్మించారు. జయంతి.. ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరాంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు కృష్ణ కుమార్.

senior heroine jayanthi passes away

senior heroine jayanthi passes away

తను సినిమాల్లో నటిస్తున్న సమయంలో జయంతికి ఉత్తమ నటిగా అవార్డులు కూడా దక్కాయి. కర్ణాటక ప్రభుత్వం తనకు ఉత్తమ నటిగా ఏడు అవార్డులను అందించింది. అలాగే.. జయంతికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. 1965 వ సంవత్సరంలో తను నటించిన మిస్ లీలావతి సినిమాకు ఉత్తమ నటిగా రాష్ట్రపతి అవార్డును జయంతి అందుకున్నారు. అలాగే.. కర్ణాటక ప్రభుత్వం.. జయంతికి అభినయ శారద అనే బిరుదును కూడా ప్రదానం చేశారు.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది