Senior Heroine lakshmi daughter aishwarya has no money
Senior Heroine : సినిమా ఇండస్ట్రీ,Film industry,లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే.. అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. లేకపోతే తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవకాశాలు ఉన్నప్పుడే అలా నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డారు. కానీ.. కొందరు మాత్రం అవకాశాలు ఉన్నప్పుడు బాగానే సంపాదించి వాటిని ఎలా దాచుకోవాలో తెలియక.. అంతా ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆఫర్లు లేనప్పుడు ఎంత ఏడ్చి మాత్రం ఏంటి లాభం. ఇప్పుడు ఆ లిస్టులో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. సీనియర్ నటి లక్ష్మీ కూతురు. నిజానికి లక్ష్మీ కూడా ఒకప్పుడు హీరోయినే. తన కూతురును కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది లక్ష్మీ. శివపుత్రడు సినిమాతో ఐశ్వర్యకు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచి తను అడపా దడపా సినిమాల్లో నటించింది. కానీ.. అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తనకు జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. తనకు ఉన్న నలుగురు పిల్లలను పోషించడం
Senior Heroine lakshmi daughter aishwarya has no money
చాలా కష్టంగా మారిందని ఐశ్యర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన పిల్లలను పోషించడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని.. ఆర్థిక కష్టాలు రావడంతో చివరకు సబ్బులు కూడా అమ్మానని ఆమె చెప్పుకొచ్చారు. సబ్బులు అమ్మగా వచ్చిన డబ్బులతో పిల్లలను పోషించానని చెప్పింది ఐశ్వర్య. అయితే.. తనకు సినిమాలు అంతగా అచ్చి రాలేదని.. సీరియల్స్ ద్వారానే తనకు నటిగా మంచి గుర్తింపు లభించిందని తెలిపింది ఐశ్వర్య. ఒక సీనియర్ నటి కూతురు అయి ఉండి.. ఐశ్వర్య ఇంతలా ఆర్థిక కష్టాలు ఎందుకు ఎదుర్కొన్నది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.