Senior NTR Heroine : ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న సీనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ !!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 March 2023,8:00 pm

Senior NTR Heroine : బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి శేషాద్రి చాలా తక్కువ టైంలో పాపులర్ అయిన హీరోయిన్లలో ఒకరు. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఆమె స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం. ఆమె తండ్రి సింద్రీ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేసేవారు. ఇక ఈమె 1981 లో 18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా పోటీలో గెలిచింది. ఆ తర్వాత బాలీవుడ్లోకి పెయింటర్ బాబు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుభాష్ దర్శకత్వంలో హీరో సినిమాలో హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత తెలుగులో

Senior NTR Heroine latest pics viral

Senior NTR Heroine latest pics viral

సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘ బ్రహ్మర్షి విశ్వామిత్ర ‘ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ , బాలకృష్ణ , మీనాక్షి శేషాద్రి, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా నటించారు. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో జీవన పోరాటం సినిమాలో కూడా నటించి పాపులర్ అయింది. ఇక చివరిగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ ఆపద్బాంధవుడు ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ టాలీవుడ్ లోనే క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో మీనాక్షికి మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఈమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. సినిమాలకు గుడ్ బై చెప్పేశాక కొన్నాళ్లకు హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుత ఈమె అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె అక్కడ డాన్స్ స్కూల్ నడుపుతూ బిజీగా గడుపుతున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఆమె అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఎన్టీఆర్, చిరంజీవిలతో నటించిన మీనాక్షి లాగే లేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి