
Serial Actress Nakshathra About Bad Behaviour Of Bus Driver In Tamilnadu Kerala
Serial Actress Nakshathra : సాధారణంగా బస్సులో రాత్రి ప్రయాణాలు మహిళలకు కాస్త ఇబ్బందికరమే. అందరు పడుకున్న తర్వాత కొందరు ఆకతాయిలు పక్కన కూర్చున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు తమ బాధలని ఓపెన్‌గా చెప్పుకున్నా, మరి కొందరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అయితే తాజాగా బుల్లితెర సీరియల్ నటి సోదరిపై ఓ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఆమె పట్ల అందరు నిద్రపోయాకా అసభ్యంకగా తాకాడు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్ చేసింది. వివరాల్లోకెలితే.. మలయాళ బుల్లితెరపై పలు సీరియల్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి నక్షత్ర. వల్లి తిరుమనం, యారది నీ మోహని వంటి సీరియల్స్ ద్వారా టెలివిజన్ ఆడియన్స్ కు చేరువయ్యింది. ఇటీవల ఆమె సోదరి చెన్నై నుంచి కేరళలోని తమ స్వస్థలం అలువా వెళ్లేందుకు ఓ ప్రైవేటు బస్సు ఎక్కింది.
అర్ధరాత్రి అందరూ నిద్రలోకి జారుకున్న సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్ ఆమెను అసభ్యంగా తాకాడు. వెంటనే తేరుకున్న ఆమె ఏం చేస్తున్నావని నిలదీయగా పొరపాటున చేయి తగిలిందంటూ తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అతడు కావాలనే తప్పుగా ప్రవర్తించాడని అర్థమైన నక్షత్ర సోదరి బస్సులో ఉన్న మిగతా ప్రయాణిలకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో అక్కడి కొందరు ప్రయాణికులు సైతం తమతోనూ అతడు అలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. తన చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తి ఫొటోను షేర్ చేస్తూ నక్షత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. ఆ బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయ్ విజయన్‌లను ట్యాగ్ చేసింది.
Serial Actress Nakshathra About Bad Behaviour Of Bus Driver In Tamilnadu Kerala
నక్షత్రకు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వల్లి తిరుమనం, యారది నీ మోహని వంటి సీరియల్స్ లో ఈమె తన నటనతో ఎంతగానో మెప్పించింది. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు తన బాధలను వ్యక్త పరుస్తూ ఉంటుంది. అలానే తన ప్రాజెక్ట్ సంగతులని కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన విషయంతో నక్షత్ర ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.