Home » Entertainment » Shaker Kammula Gave A Huge Offer To Komali
Entertainment

Komali : పోరాడి సాధించిన కోమలి.. శేఖర్ కమ్ముల భారీ ఆఫర్..!

Authored By
vamana sai
The Telugu News | Published on: March 13, 2021, 10:40 am
Advertisement

Komali : లవ్ స్టోరి సినిమా లోని సారంగ దరియా పాట విషయంలో పెద్ద రచ్చే జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా లవ్ స్టోరి. నాగ చైతన్య – సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మీద ముందు నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. సాయి పల్లవి, నాగ చైతన్య పోస్టర్స్, రొమాంటిక్ టీజర్, ట్రైలర్ లతో బాగా అంచనాలు పెరిగాయి. మరోసారి ఫిదా బ్యూటీ సాయి పల్లవి మెస్మరైజ్ చేయబోతోందని చెప్పుకుంటున్నారు. ఇక నాగ చైతన్య ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ చాలానే చేశాడు.

Advertisement

అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న లవ్ స్టోరీ మాత్రం చైతూ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా మిగిలిపోతుందని అక్కినేని ఫ్యామిలీ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో మొదటి సారి నాగ చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. ఈక్రమంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘సారంగ దరియా’ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్లో సాయి పల్లవి తన డాన్స్ తో మైండ్ బ్లాస్ట్ చేస్తోంది. ఈ ఒక్క సాంగ్ సినిమా మీద ఊహించని విధంగా అంచనాలు పెంచేసింది.

shaker kammula gave a huge offer to komali

Advertisement

Komali : కోమలికే ‘సారంగ దరియా’ సాంగ్ క్రెడిట్ దక్కుతుందని ప్రకటించాడు.

ఇంత పాపులర్ అయిన ఈ సాంగ్ కి విమర్శలు.. ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటకి పదాలు కూర్చిన కోమలి ఇది నాపాటే .. నాకు అన్యాయం జరిగిందంటూ పలు మీడియా సంస్థల ద్వారా తన ఆవేదనని వ్యక్తం చేసింది. మొదటి రెండు రోజులు పెద్దగా స్పందించని మేకర్స్ ఎట్టకేకలకి దిగి వచ్చారు. కోమలి పోరాటాన్ని ఆపేందుకు స్వయంగా దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించాడు. ఈ సాంగ్ క్రెడిట్ కోమలికే దక్కుతుందని ప్రకటించాడు. అంతేకాదు ఈపాటకి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు తనకి పాట పాడే అవకాశాన్ని కల్పించనున్నట్టు వెల్లడించాడు. కాగా ఈపాట ముందు కోమలికే పాడే అవకాశం వచ్చినప్పటికి తనకి ఆరోగ్యం బాగోలేక 10 రోజులు సమయం అడిగింది. కాని సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మంగ్లీ తో పాడించారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి