శాకుంతలం మోషన్ టీజర్ లో సమంత అదిరిపోయింది ..!

Authored By vamana sai | The Telugu News | Published on: January 1, 2021, 5:41 pm

శాకుంతలం .. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న లేటెస్ట్ సినిమా. మహాభారతంలోని ఓ అద్భుత ఘట్టం ఆధారంగా ఈ సినిమాని గుణ శేఖర్ తెరకెక్కించబోతున్నాడు. గుణ టీం వర్క్ అన్న సొంత బ్యానర్ లో దర్శకుడు గుణ శేఖర్ – ఆయన సతీమణి నీలిమ గుణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో శాకుంతలం గా నటిస్తున్న హీరోయిన్ విషయంలో పలు పేరు వినిపించాయి. రుద్రమదేవి సినిమాలో నటించిన అనుష్క శెట్టి తోపాటు కీర్తి సురేష్, పూజా హెగ్డే లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె పేరు వినిపించాయి. అలాగే కొత్త అమ్మాయిని శాకుంతలంగా తీసుకుంటున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అపురూపంగా గుణశేఖర్ 'శాకుంతలం' - Gunashekar shakuntalam movie motion poster  release

అయితే ఈరోజు ఉదయం గుణ సేఖర్ టీం ఈ సినిమా నుంచి భారీ సర్ప్రైజ్ రాబోతుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దాంతో అందరూ ఈ సినిమాలో నటించే హీరోయిన్ నే పరిచయం చేయబోతున్నారని ఆతృతగా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్టుగానే న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాలో సమంత అక్కినేని శాకుంతలంగా నటించబోతున్నట్టు గుణశేఖర్ టీం అధికారకంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా నుంచి మోషన్ టీజర్ ని రిలీజ్ చేసి అక్కినేని ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Samantha Akkineni to essay the lead role in Gunashekar's Shakuntalam!? -  ManaTeluguMovies.net

ఇక గత కొన్ని నెలలుగా సమంత నటించే నెక్స్ట్ సినిమా ఎంటన్నది ఇండస్ట్రీ తో పాటు ఫ్యాన్స్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. జాను డిజాస్టర్ తర్వాత మళ్ళీ సమంత ఏ తెలుగు సినిమాని ప్రకటించలేదు. దాంతో గుణ శేఖర్ శాకుంతలంగా నటిస్తున్న సమంత తాజా చిత్రం మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 త్వరలో అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp