JR NTR : శంక‌ర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో సినిమా..! ఎప్పుడు ప‌ట్టాలెక్క‌నుందంటే

Authored By mallesh | The Telugu News | Published on: May 17, 2022, 12:30 pm

JR NTR : శంక‌ర్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ సినిమా చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ కాంబినేష‌న్ సెట్ అయితే ఇక నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ కోసం క‌థ సిద్దం చేసిన‌ట్లు త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ కి వినిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేప‌థ్య‌లోనే డైరెక్ట‌ర్ శంక‌ర్ తో పాన్ ఇండియా సినిమా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఇక ఎన్టీఆర్ నాలుగేళ్లు గా ఆర్ఆర్ఆర్ కు ప‌ని చేసి చాలా గ్యాప్ ఇచ్చాడు. అందుకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం కొరటాల శివతో త‌న‌ 30వ సినిమా ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. అలాగే ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో కూడా తారక్ మ‌రో సినిమాకి క‌మిట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్ తో మ‌రో సినిమా ప్లాన్ చేశాడు. కాగా ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయిన త‌ర్వాత‌నే శంక‌ర్ తో సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి మ‌రో నాలుగేళ్లు ప‌ట్టేలా క‌నిపిస్తోంది.అయితే అప్ప‌ట్లోనే శంక‌ర్ పాన్‌ ఇండియా డైరెక్టర్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. శంక‌ర్ సినిమాలు అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసేవి. భార‌తీయుడు, ఒకేఒక్క‌డు, అప‌రిచితుడు, రోబో చిత్రాల‌తో శంక‌ర్ వండ‌ర్స్ క్రియేట్ చేశాడు.

Shankar Jr NTR combination in Movie

Shankar Jr NTR combination in Movie

అందుకే శంక‌ర్ తో సినిమా అంటే భారీ అంచ‌నాలు ఉంటాయి. ప్ర‌స్తుతం రామ్‌చరణ్ తో ఆర్సీ 15 సినిమా మొద‌లుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లు పెట్టేశారు. ఈ సినిమా తర్వాత శంకర్ రణ్‌వీర్‌ సింగ్‌తో బాలీవుడ్ లో అపరిచితుడు 2 చేయబోతున్నాడు. కాగా ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేలోపు.. ఎన్టీఆర్ కూడా త‌న సినిమాల‌ను కంప్లీట్ చేసుకునే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌జెక్ట్ పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ కాంబినేష‌న్ పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్, శంక‌ర్ ఫొటోలు పోస్ట్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp