Game Changer : గేమ్ ఛేంజర్ శంకర్ కంబ్యాక్ చూస్తారు.. మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చిన దిల్ రాజు..!
ప్రధానాంశాలు:
Game Changer : గేమ్ ఛేంజర్ శంకర్ కంబ్యాక్ చూస్తారు.. మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చిన దిల్ రాజు..!
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. శంకర్ Shankar డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు Dil Raju ఈ సినిమాను ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కించారు. శంకర్ సినిమా అంటే భారీతనం ఉండాల్సిందే. అందుకే గేమ్ ఛేంజర్ Game Changer సినిమాలో కేవలం సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చు చేశారట. ఇక సినిమాలో రామ్ చరణ్ Ram Charan కి జోడీగా అందాల భామ కియరా అద్వాని కూడా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయనుంది. థమన్ మ్యూజిక్ తో వచ్చిన సాంగ్స్ గేం ఛేంజర్ కు మంచి బజ్ క్రియేట్ చేసింది. ఐతే గేమ్ ఛేంజర్ సినిమా గురించి లేటెస్ట్ గా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా సంక్రాంతికి శంకర్ కు, తనకు మంచి కంబ్యాక్ ఇస్తుందని అన్నారు….
Game Changer : బెనిఫిట్ షోస్ కు లైన్ క్లియర్
సంక్రాంతి సినిమాలకు ఏపీలో ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. అక్కడ బెనిఫిట్ షోస్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఐతే తెలంగాణాలో మాత్రం టికెట్ రేట్ల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అదే విషయాన్ని దిల్ రాజు Dil Raju ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి చర్చిస్తామని అన్నారు. ఆయన సినిమా పరిశ్రమకు ఏదైనా హెల్ప్ చేస్తామని అన్నారు. అందులో టికెట్ ప్రైజ్ ఇష్యూ కూడా ఉందని అన్నారు దిల్ రాజు.
గేమ్ ఛేంజర్ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుందని అన్నారు దిల్ రాజు. సినిమా కథ ఏదైతే చెప్పారో అదే తెర మీద తీశారు. శంకర్ గారి సినిమా ఎలా ఉంటుందో గేమ్ ఛేంజర్ అలా ఉంటుంది. తనకు శంకర్ గారికి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇస్తుందని అన్నారు దిల్ రాజు. మరి ఆయన చెప్పిన విధంగా సినిమా సూపర్ హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి. Shankar, Ram Charan, Game Changer, Dil Raju