Shankar : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పెట్టించి సినిమాలు తీసే దర్శకుడు ఒక్క ఎస్ ఎస్ రాజమౌళీనే. ఈ సినిమా ఆయన మీద నమ్మకంతో నిర్మాతలు 300 అని చెప్పినా, 500 అని చెప్పినా కూడా కళ్ళు మూసుకొని బడ్జెట్ కేటాయిస్తారు. మిగతా ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కూడా బడ్జెట్ విషయంలో మన టాలీవుడ్ మేకర్స్ బాగా ఆలోచిస్తారు. దీని కారణం ఒకటే రాజమౌళి పెట్టిన బడ్జెట్‌కి తిరిగి రెండింతలు పైగానే లాభాలు తెచ్చిపెడతాడు. కానీ, మిగతా దర్శకుల విషయంలో ఆ భరోసా మేకర్స్ ఉండదు.
అయితే, తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా, హాలీవుడ్ రేంజ్ సినిమాలను తీస్తూ ఇండియన్ జేం కెమరూన్ అనే పేరు సంపాదించుకున్నారు క్రియేటివ్ జీనియస్ శంకర్. ఆయన సినిమా అంటే ప్రంచంలో ఓ పదేళ్ళ తర్వాత ఎలాంటి పరిణాలు చోటు చేసుకుంటాయో అది ముందే చూపిస్తుంటారు. అందుకే, ఆయన సినిమాలకు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ ఉంటుంది. ఇక హీరోలతో చేసే ప్రయోగాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రజినీకాంత్‌ను రోబోగా చూపించాలన్నా, విక్రమ్మ్ ని అపరిచితుడుగా చూపించాలన్నా ఒక్క శంకర్ వల్లే అవుతుంది.
సైన్స్ నేపథ్యంగా తెరకెక్కించే శంకర్ ..కేవలం ఒక్క షాట్ కోసమే కోట్లు ఖర్చు చేస్తారు. విజువల్ ట్రీట్ ఎంత గ్రాండ్ ఉంటుందో దాని వెనక అంత బడ్జెట్ కేటాయించి ఉంటుంది. సినిమా మేకింగ్ సమయంలో నిర్మాత కాస్త భయపడినా తర్వాత వచ్చే లాభాలు చూసి మాత్రం అన్నీ మర్చిపోతాడు. అయితే, తమిళ ఇండస్ట్రీలో శంకర్ తో సినిమా చేయాలని పెద్ద సంస్థలు కాచుకు కూర్చుంటాయి. కానీ, ఆయన ఒక్కో సినిమాకే కనీసం మూడు నాలుగేళ్ళ సమయం తీసుకుంటారు. అందుకే, చాలా తక్కువ సినిమాలు వచ్చాయి.
ఇక ప్రస్తుతం తెలుగులో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 15 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. ముందు అనుకున్న 150 కోట్లలో సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ, ఇప్పుడది 200 కోట్ల వరకు పెరిగిందని..ఇంకా ఎంతవరకు ఈ బడ్జెట్ పెరుగుతుందో చెప్పడం కష్టమని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మరికొంతమంది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఆయనతో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నప్పటికి బడ్జెట్ విషయంలోనే వెనకడుగు వేస్తున్నారట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.