Shankar : ఈ క్రియేటివ్ జీనియస్ దెబ్బకి టాలీవుడ్ తట్టుకుంటుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shankar : ఈ క్రియేటివ్ జీనియస్ దెబ్బకి టాలీవుడ్ తట్టుకుంటుందా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :15 July 2022,7:05 pm

Shankar : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పెట్టించి సినిమాలు తీసే దర్శకుడు ఒక్క ఎస్ ఎస్ రాజమౌళీనే. ఈ సినిమా ఆయన మీద నమ్మకంతో నిర్మాతలు 300 అని చెప్పినా, 500 అని చెప్పినా కూడా కళ్ళు మూసుకొని బడ్జెట్ కేటాయిస్తారు. మిగతా ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కూడా బడ్జెట్ విషయంలో మన టాలీవుడ్ మేకర్స్ బాగా ఆలోచిస్తారు. దీని కారణం ఒకటే రాజమౌళి పెట్టిన బడ్జెట్‌కి తిరిగి రెండింతలు పైగానే లాభాలు తెచ్చిపెడతాడు. కానీ, మిగతా దర్శకుల విషయంలో ఆ భరోసా మేకర్స్ ఉండదు.

అయితే, తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా, హాలీవుడ్ రేంజ్ సినిమాలను తీస్తూ ఇండియన్ జేం కెమరూన్ అనే పేరు సంపాదించుకున్నారు క్రియేటివ్ జీనియస్ శంకర్. ఆయన సినిమా అంటే ప్రంచంలో ఓ పదేళ్ళ తర్వాత ఎలాంటి పరిణాలు చోటు చేసుకుంటాయో అది ముందే చూపిస్తుంటారు. అందుకే, ఆయన సినిమాలకు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ ఉంటుంది. ఇక హీరోలతో చేసే ప్రయోగాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రజినీకాంత్‌ను రోబోగా చూపించాలన్నా, విక్రమ్మ్ ని అపరిచితుడుగా చూపించాలన్నా ఒక్క శంకర్ వల్లే అవుతుంది.

Shankar Will Tollywood survive the blow of this creative genius

Shankar Will Tollywood survive the blow of this creative genius

Shankar : పెద్ద సంస్థలు కాచుకు కూర్చుంటాయి.

సైన్స్ నేపథ్యంగా తెరకెక్కించే శంకర్ ..కేవలం ఒక్క షాట్ కోసమే కోట్లు ఖర్చు చేస్తారు. విజువల్ ట్రీట్ ఎంత గ్రాండ్ ఉంటుందో దాని వెనక అంత బడ్జెట్ కేటాయించి ఉంటుంది. సినిమా మేకింగ్ సమయంలో నిర్మాత కాస్త భయపడినా తర్వాత వచ్చే లాభాలు చూసి మాత్రం అన్నీ మర్చిపోతాడు. అయితే, తమిళ ఇండస్ట్రీలో శంకర్ తో సినిమా చేయాలని పెద్ద సంస్థలు కాచుకు కూర్చుంటాయి. కానీ, ఆయన ఒక్కో సినిమాకే కనీసం మూడు నాలుగేళ్ళ సమయం తీసుకుంటారు. అందుకే, చాలా తక్కువ సినిమాలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం తెలుగులో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 15 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. ముందు అనుకున్న 150 కోట్లలో సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ, ఇప్పుడది 200 కోట్ల వరకు పెరిగిందని..ఇంకా ఎంతవరకు ఈ బడ్జెట్ పెరుగుతుందో చెప్పడం కష్టమని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మరికొంతమంది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఆయనతో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నప్పటికి బడ్జెట్ విషయంలోనే వెనకడుగు వేస్తున్నారట.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది