Deepthi Sunaina Shanmukh : మంచి ముహూర్తాన తిరిగి ఒక్కటి కాబోతున్నదీప్తి సునయన షణ్ముఖ్.. ఎప్పుడు, ఎక్కడ?
Deepthi Sunaina Shanmukh : యూట్యూబర్స్ గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన జంట దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్. ఈ ఇద్దరు కలిసి పలు వీడియోలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. వీరికి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు వీరు ప్రేమలో మునిగి తేలారు. బిగ్ బాస్ లో సిరీతో షణ్ముఖ్ మితిమీరిన హగ్గులు, ముద్దులవ వలన ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు.ప్రస్తుతానికైతే.. ఈ ఇద్దరూ ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు.
వీరు కలవాలని వారి అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. ఆ మధ్య షణ్ముఖ్ తండ్రి త్వరలోనే వీరు కలుస్తారు అని చెప్పాడు. అయితే ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుందో అని అందరు ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో షణ్ముఖ్-దీప్తి సునయన మళ్లీ కలవబోతున్నారనే లీక్‌లు బయటకు వచ్చాయి. అందుకు మళ్లీ బిగ్ బాస్‌నే వేదిక కాబోతుందట. వాలంటైన్స్ డే సందర్భంగా అయినా వీరి జంట మళ్ళీ తెరపై సందడి చేస్తే బాగుండు అని చాలా మంది ఫ్యాన్స్ కోరకుంటున్నారు. ప్రేమికుల రోజున వీరు రియలైజ్ అయ్యి..మళ్లీ కలిస్తే.. సోషల్ మీడియాలో పండగచేసుకోవాలని చూస్తున్నారు.

shanmukh deepthi sunaina meets agaain
Deepthi Sunaina Shanmukh : ఊహించింది జరుగునా..!
అది జరగనుందని సమాచారం.బిగ్‌బాస్ నిర్వాహకులు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్ సెలబ్రెషన్స్‌కు ప్లాన్ చేశారట. ఆ రోజు అయిదు సీజన్ల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించి పెద్ద ఉత్సవం చేయబోతున్నట్లు వినికిడి. ఆ వేదికపై షణ్ముఖ్ ‘మై లవ్ ఈజ్ గాన్’ అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్‌కి పర్‌ఫార్మెన్స్ చేయనున్నాడు. ఇందుకోసం తెగ పెర్ఫామెన్స్ చేస్తూ వీడియోలు వదులుతున్నాడు. అదే వేదికపై వీరిద్దరు కలవనున్నారనే ప్రచారం ఒకటి నడుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.