
siri comments on shanmukh
Shanmukh : సోషల్ మీడియా సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. చిన్న షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ చేస్తూ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ క్రేజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్‌తో ఒక్కసారిగా మారిపోయింది. ఈ సిరీస్ తర్వాత వచ్చిన సూర్య కూడా అదే రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కాని అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రన్నరప్‌గా నిలిచాడు.సిరితో స్నేహం..
శ్రుతి మించిన హగ్గులతో షణ్ముఖ్ టైటిల్ గెలవలేకపోయాడని, కొందరి వాదన. అలానే దీప్తి.. షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పడానికి కారణం బిగ్ బాస్ అని కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తుంది. అయితే కొద్ది రోజులుగా మూడీగా ఉంటూ వస్తున్న షణ్ముఖ్ తమ బ్రేకప్‌కి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు. ‘మా ఇద్దరి బ్రేకప్ సిరి కారణం కాదు. చెప్పాలంటే సిరి, దీప్తి ఎప్పటికి మంచి స్నేహితులే. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది అని అన్నాడు.ప్రేక్షకులలో నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడానికే రియాల్టీ షోకు వెళ్లాను. నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా.. కానీ షో నుంచి బయటకు వచ్చాక తెలిసింది నాపై అంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది.
shanmukh gives clarity about break up
నేను 27 సంవత్సరాల వయసులోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. సిరికి అండగా ఉండడం వలన మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. సిరి వాళ్లమ్మ వచ్చి మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చలేదని చెప్పింది. చాలా భాదనిపించింది. నాకు ఆమె అలా మాట్లాడటం నచ్చలేదు. సిరి వాళ్లమ్మ నా గురించి తప్పుగా అనుకోవడం తట్టుకోలేకపోయాను. ఇక దీప్తి, నేను కలుస్తామా లేదా అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను అని షణ్ముఖ్ స్పష్టం చేశాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.