
shanmukh starts another love story
Shanmukh : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీలు అయ్యారు. అయితే మా టీవీ ఇప్పటికీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పలు ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటుంది. వాటికి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంటాయి.తాజాగా బిగ్ బాస్ జోడీ ఈవెంట్ పేరుతో స్టార్ మాలో అన్ లిమిటెడ్ ఎంటర్టన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 13 సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుండగా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.ఇందులో షణ్ముఖ్‌తో తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. మిస్టర్ మజ్ను సాంగ్‌కి మెలికలు తిరిగే స్టెప్‌లు వేసి అదరహో అనిపించాడు. అందుకే ఈ ప్రోమోలో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కామెంట్లలో మాత్రం షణ్ముఖ్ పేరు మారుమోగిపోతుంది.
అయితే షణ్ముఖ్ డ్యాన్స్ తర్వాత రవి.. షణ్ముఖ్ మిస్టర్ మజ్నునా లేదంటే మజ్ను అయ్యేందుకు ప్రాసెస్‌లోఉన్నాడా అని అడిగాడు. ఆ తర్వాత దీపికా పిల్లి ..షణ్ముఖ్ ఒక్కోసారి మన్మథుడిలా ఉంటాడు అని అనగా, దానికి వెంటనే స్పందించిన షణ్ముఖ్.. దీపికా సింగిల్ అయితే ఎలానో, అలా అని సమాధానం ఇచ్చాడు. మొత్తానికి ఈ ప్రోమోలో దీప్తి సునయన టాపిక్ ఇన్‌డైరెక్ట్‌గా తీసుకురావడం విశేషం.ఈ షోలోలో యాంకర్ రవికి దీపిక పిళ్లై జోడీ కాగా.. అరియానా-సొహైల్, ప్రియాంక-జెస్సీ, ధనరాజ్-జ్యోతి, వరుణ్ సందేశ్-వితిక, మానస్-లహరి, నోయల్-హారిక, అవినాష్-రోహిణి.. ఇలా చాలామంది కంటెస్టెంట్స్‌ని ప్రేమ పక్షులుగా మార్చేశారు బిగ్ బాస్. ముక్కు అవినాష్ ..
shanmukh starts another love story
రోహిణిపై పదే పదే కామెంట్స్ పేల్చుతుండగా, అందుకు రోహిణి కూడా తనదైన శైలిలో విరచుకు పడింది. అలానే పర్‌ఫార్మెన్స్‌లు కూడా అందరు ఇరగదీసారు. సోహైల్‌కి అరియానా కిస్ ఇవ్వడం కొసమెరుపు. మొత్తానికి ప్రోమో రచ్చ చేస్తుంది.జగమే మాయ.. బ్రతుకే మాయ అంటూ.. ఏఎన్ఆర్ ఇమిటేట్ చేసిన అవినాష్ బాగానే నవ్వించాడు. అందులో రోహిణి వేసిన పంచ్‌లు బాగా పేలాయి. ఇక పంక్చర్ షాప్ స్కిట్‌లో బాడీ షేమింగ్ చేసుకున్నారు రోహిణి, అవినాష్‌లు. మొదటి రోహిణి.. ‘ఎంత పంక్చర్ షాపు అయితే మాత్రం టైర్లు షాపులో కాకుండా ఇక్కడ కూడా పెట్టుకున్నావ్ అని అవినాష్ పెట్టపై చేయి వేసి వెటకారం చేసింది.
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
School Holidays: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. జనవరి 28…
This website uses cookies.