
shekhar master cry in star maa comedy stars show
Shekhar Master : స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కు జడ్జ్ గా శేఖర్ మాస్టర్ మరియు శ్రీదేవిలు వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ షో జబర్దస్త్ కు పోటీ అన్నట్లుగా మంచి రేటింగ్ తో దూసుకు పోతుంది. శ్రీదేవి మరియు శేఖర్ మాస్టర్ లు కలిసి చేస్తున్న ఈ షో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో షో ను మరింతగా రక్తి కట్టించేందుకు స్కిట్స్ లో సెంటిమెంట్ ను పండిస్తున్నారు. వచ్చే ఆది వారం రాబోతున్న షో కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రోమోలో అవినాష్ టీమ్ ఫుడ్ వద్ద కొట్టుకునే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంకు శేఖర్ మాస్టర్ చలించి పోయాడు. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు.
shekhar master cry in star maa comedy stars
శేఖర్ మాస్టర్ కెరీర్ ఆరంభంలో రోజుకు 75 రూపాయల పారితోషికంతో పని చేశాడట. షూటింగ్ లకు వెళ్లిన చోట ప్రొడక్షన్ వారు ఫుడ్ పెడితే తోసుకుని మరీ తినేవాళ్లం అంటూ శేఖర్ కన్నీరు పెట్టుకుని మరీ చెప్పాడు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఆయన తన గతంను గుర్తు చేసుకున్నాడు. శేఖర్ మాస్టర్ ఏడ్వడంతో అక్కడున్న వారు అంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆయన్ను పక్కన ఉన్న శ్రీదేవి ఓదార్చే ప్రయత్నం చేశారు. శేఖర్ మాస్టర్ కెరీర్ చాలా దయనీయ పరిస్థితిలో సాగిందని అందరికి తెల్సిందే. కాని తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో తాను గడిపినట్లుగా ఆయన చెప్పడం అందరిని కలచి వేసింది.
స్టార్ మా లో కామెడీ స్టార్స్ చేస్తున్న శేఖర్ మాస్టర్ గత కొన్ని వారాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో లో కనిపించడం లేదు. ఢీ లో ఆయన లేని లోటు క్లీయర్ గా కనిపిస్తుంది. తమ జబర్దస్త్ కు పోటీగా వచ్చిన కామెడీ స్టార్స్ కు జడ్జ్ గా వ్యవహరించడం పట్ల మల్లెమాల వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఢీ షో నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ కామెడీ షో లో కూడా గతంలో శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరించాడు. ఇప్పుడు పూర్తిగా స్టార్ మా కే పరిమితం అయ్యాడు.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.