Shekhar Master : కన్నీరు పెట్టుకున్న శేఖర్‌ మాస్టర్‌, కెరీర్‌ ఆరంభంలో పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చాయట

Authored By Himanshi | The Telugu News | Published on: April 23, 2021, 9:40 pm

Shekhar Master : స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కు జడ్జ్‌ గా శేఖర్‌ మాస్టర్ మరియు శ్రీదేవిలు వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ షో జబర్దస్త్‌ కు పోటీ అన్నట్లుగా మంచి రేటింగ్‌ తో దూసుకు పోతుంది. శ్రీదేవి మరియు శేఖర్‌ మాస్టర్‌ లు కలిసి చేస్తున్న ఈ షో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో షో ను మరింతగా రక్తి కట్టించేందుకు స్కిట్స్‌ లో సెంటిమెంట్ ను పండిస్తున్నారు. వచ్చే ఆది వారం రాబోతున్న షో కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రోమోలో అవినాష్‌ టీమ్‌ ఫుడ్‌ వద్ద కొట్టుకునే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంకు శేఖర్ మాస్టర్‌ చలించి పోయాడు. తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు.

shekhar master cry in star maa comedy stars

shekhar master cry in star maa comedy stars

శేఖర్‌ మాస్టర్‌ కెరీర్‌ ఆరంభంలో రోజుకు 75 రూపాయల పారితోషికంతో పని చేశాడట. షూటింగ్‌ లకు వెళ్లిన చోట ప్రొడక్షన్‌ వారు ఫుడ్‌ పెడితే తోసుకుని మరీ తినేవాళ్లం అంటూ శేఖర్ కన్నీరు పెట్టుకుని మరీ చెప్పాడు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఆయన తన గతంను గుర్తు చేసుకున్నాడు. శేఖర్‌ మాస్టర్‌ ఏడ్వడంతో అక్కడున్న వారు అంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆయన్ను పక్కన ఉన్న శ్రీదేవి ఓదార్చే ప్రయత్నం చేశారు. శేఖర్‌ మాస్టర్‌ కెరీర్‌ చాలా దయనీయ పరిస్థితిలో సాగిందని అందరికి తెల్సిందే. కాని తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో తాను గడిపినట్లుగా ఆయన చెప్పడం అందరిని కలచి వేసింది.

స్టార్‌ మా లో కామెడీ స్టార్స్ చేస్తున్న శేఖర్ మాస్టర్‌ గత కొన్ని వారాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో లో కనిపించడం లేదు. ఢీ లో ఆయన లేని లోటు క్లీయర్ గా కనిపిస్తుంది. తమ జబర్దస్త్‌ కు పోటీగా వచ్చిన కామెడీ స్టార్స్ కు జడ్జ్‌ గా వ్యవహరించడం పట్ల మల్లెమాల వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఢీ షో నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్‌ కామెడీ షో లో కూడా గతంలో శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్‌ గా వ్యవహరించాడు. ఇప్పుడు పూర్తిగా స్టార్‌ మా కే పరిమితం అయ్యాడు.

Himanshi

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp