Home » Entertainment » Shnamukh Interesting Comments On Deepti Sunaina
Entertainment

Deepthi Sunaina Shanmukh : దీప్తి సునయనను వదిలే ప్రసక్తే లేదంటున్న షణ్ముక్ .. చివరకు ఏమవుతుందో?

Authored By
mallesh
The Telugu News | Published on: January 16, 2022, 9:00 pm
Advertisement

Deepthi Sunaina Shanmukh  : సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో షణ్ముక్ జస్వంత్, దీప్తి సునయన ఉన్నారు. యూట్యూబర్‌గా షణ్ముక్ జస్వంత్ కు మంచి పేరు వచ్చిన క్రమంలో ఆయన్ను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకున్నారు. షణ్ముక్ సీజన్ ఫైవ్ రన్నరప్ గా నిలిచాడు కూడా. అయితే, హౌజ్ లో షణ్ముక్ వ్యవహరించిన తీరుపైన సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరిగింది . చివరకు షణ్ముక్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పేదాక పరిస్థితులు వచ్చాయి. అయితే, ఆమె బ్రేకప్ చెప్పినప్పటికీ తాను మాత్రం ఆమెను వదిలే ప్రస్తకే లేదని అంటున్నాడు షణ్ముక్.

Advertisement

బిగ్ బాస్ హౌజ్ లో సిరి హన్మంత్ తో షణ్ణు రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరిగింది. సిరితో షణ్ణు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. దాంతో పాటు ఫ్రెండ్ షిప్ అంటూనే హగ్స్ ఇవ్వడం, పక్కపక్కనే కూర్చోవడం, దుప్పట్లో దూరిపోవడం లాంటివి చూసి నెటిజన్లు షణ్ణుపైన నెగెటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా నెగెటివిటీని మూట కట్టుకున్నాడు షణ్ణు.ఈ క్రమంలోనే ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్న దీప్తి సునయన ఇటీవల షణ్ముక్ జస్వంత్ కు బ్రేకప్ చెప్పేసింది కూడా.

shnamukh interesting comments on deepti sunaina

Advertisement

Deepthi Sunaina Shanmukh  : బ్రేకప్ చెప్పినా.. ఆమె వెంటే.. !

ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. కాగా, దీప్తి సునయన డెసిషన్ ను షణ్ముక్ జస్వంత్ స్వాగతించాడు. కాగా, ఇటీవల దీప్తి బర్త్ డే సందర్భంగా షణ్ము చెప్పిన విషెస్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. దాంతో పాటు ఇటీవల ఇన్ స్టా లైవ్‌లో నెటిజన్లు ప్రశ్నలకు షణ్ణు ఇచ్చిన సమాధానాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. దీప్తి సునయన గురించి చాలా మంది ప్రశ్నించగా, తన నెంబర్‌ను దీప్తి సునయన బ్లాక్ చేసిందని, అయితే, తాను త్వరలో డైరెక్ట్‌గానే దీప్తిని హైదరాబాద్ కు వెళ్లి కలుస్తానని చెప్పాడు. అలా దీప్తి సునయనను వదిలే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పేశాడు షణ్ణు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి