Shriya Saran : హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది శ్రియ. ఒకప్పుడు యువకుల కలల రాణిగా శ్రియ యువకుల మనుసులు దోచుకుంది. ఇక శ్రియా ఇప్పటికి తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. శ్రియ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.
అలాగే ఈ సినిమాలో శ్రియ నటనకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక పాత్రలో నటించింది శ్రియ. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో శ్రియ అజయ్ దేవగణ్ నటించింది. ఈ పాత్ర కొద్ది నిమిషాల పాటు కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ క్యారెక్టర్ ద్వారా శ్రియ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీయ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఎస్ఎస్ రాజమౌళి అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె వెల్లడించింది. శ్రీయ తనకు తెలిసినంతవరకు రాజమౌళి ఆస్తమా తో ఇబ్బంది పడుతూనే సినిమా షూటింగ్ పూర్తి చేశారని చెప్పుకొచ్చింది. సెట్ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పటికీ రాజమౌళి ధ్యాస మొత్తం సినిమా పైనే ఉండేది అని శ్రియ చెప్పుకొచ్చింది. రాజమౌళి ఆరోగ్యం బాగా లేకున్నా ఎంతో కష్టపడి ఆర్ఆర్ఆర్ సినిమా అని తెరకెక్కించారు. ఆయన పడ్డ శ్రమకి తగిన ఫలితమే లభించింది అని చెప్పవచ్చు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.