Shruti Haasan : కమల్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాల కన్నా తన ఎఫైర్స్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. శాంతనుతో ప్రేమలో పడటానికి ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేని శృతి హాసన్ కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అతనితో బ్రేకప్ చెప్పి శాంతనుతో కొన్నాళ్లు రచ్చ చేసింది. తన లవ్, రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ రహస్యంగా ఉండాలని ఆవిడ అనుకోలేదు. శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా శృతి హాసన్ సైలెంట్ అవ్వడంతో జనాలకు డౌట్ వచ్చింది. ఆరా తీయగా… శాంతనుతో ఆవిడ బ్రేకప్ న్యూస్ నెల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు అది నిజమని ఆవిడ చెప్పింది.
రెండేళ్లుగా పైగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో శృతి హాసన్ సహజీవనం చేసింది. అతనితో విడిపోయాక సింగిల్ అయింది. ఇకపై ప్రేమ జోలికి పోకూడదని ఆమె డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు శృతి హాసన్ కి నిద్ర పట్టడం లేదట. లోకం అంతా నిద్ర పోతున్న వేళ ఆమె మాత్రం ఫోన్ లో ఫ్రెండ్స్ కి మీమ్స్ పంపిస్తుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టింది. ఫోన్ లో మీమ్స్ చూడటానికి శృతి హాసన్ అడిక్ట్ అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.బహుశా ఒంటరి తనం వలన శృతి హాసన్ కి నిద్రపట్టడం లేదేమో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ కూడా లేవు. అడివి శేష్ కి జంటగా డెకాయిట్ అనే ఓ మూవీ చేస్తుంది. సలార్ 2 పట్టాలెక్కితే మరో ప్రాజెక్ట్ ఖాతాలో చేరుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలి’తో పాటు ఓ హిందీ సినిమా కూడా ఉంది. ఇప్పుడు ఆవిడ కాన్సంట్రేషన్ అంతా సినిమాలపై ఉందని సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో బిజీ కావాలని చూస్తోందట. మరి ఇప్పటికైన శృతి బుద్ది తెచ్చుకొని సినిమాలే చేస్తుందా, లేదంటే మళ్లీ ఎవరైన ప్రేమలో పడుతుందా అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.