Sruthi Hassan : చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య చిచ్చు పెట్టిన శృతి హాస‌న్.. అప్పుడు సిమ్రాన్ కూడా ఇలానే చేసింది..!

Authored By Sam C | The Telugu News | Updated on : 1 December 2022, 1:40 pm

Sruthi Hassan: తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పండ‌గ‌కి కోడిపందాలు. గాలిపటాలు ఎగరగవేయడం…ముగ్గులు వేయడంతో పాటు థియేట‌ర్స్‌లో పెద్ద సినిమాల సంద‌డి ఉంటుంది. రాబోయే సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదు అని అర్ధ‌మ‌వుతుంది. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాలకృష్ణ, త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో ప‌లువురు హీరోలు ఈ సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. అయితే యంగ్ హీరోలుగా ఉన్న సమయం నుండి బాలయ్య చిరు దాదాపు 30 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగ‌గా,

చాలాకాలం తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని సంక్రాంతికి సంద‌డి చేయ‌నుండ‌గా, బాల‌య్య వీర సింహారెడ్డితో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ ఇద్దరిలో గెలుపు ఎవ‌రిదా అనే చర్చ మొద‌లైంది. అయితే ఇక్క‌డ ఓ సెంటిమెంట్ కూడా చ‌ర్చ‌కు వ‌స్తుంది. గ‌తంలో సంక్రాంతి బ‌రిలో చిరంజీవి, బాల‌య్య మృగ‌రాజు, స‌మ‌ర‌సింహా రెడ్డి చిత్రాల‌తో బ‌రిలోకి దిగారు. ఈ రెండు చిత్రాల‌లో సిమ్రాన్ క‌థానాయిక‌గా న‌టంచ‌గా, వీటిలో మృగ‌రాజు అట్ట‌ర్ ఫ్లాప్గా నిలిచింది. స‌మర సింహా రెడ్డి విజ‌యం సాధించింది.

Shruti Haasan who made a difference between Chiranjeevi and Balayya

Shruti Haasan who made a difference between Chiranjeevi and Balayya

Sruthi Hassan : శృతి ర‌చ్చ‌..

ఇక ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌లో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రెండు సినిమాల్లోనూ శృతి 30 + ఏజ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తుంది. గ‌తంలో సిమ్రాన్ సెంటిమెంట్ ప్ర‌కారం బాల‌య్య‌కు హిట్ ద‌క్కింది. ఈసారి శృతి హాస‌న్ సెంటిమెంట్ ఎవ‌రికి క‌లిసి వ‌స్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. . అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాలో శృతి పాత్ర హైలెట్ అవుతుంది… ఏ సినిమాతో మంచి గుర్తింపు వ‌స్తుంద‌న్న దానిపై చిరు, బాల‌య్య అభిమానుల మ‌ధ్య కామెంట్ల చ‌ర్చ కూడా నడుస్తుంది. మ‌రి చూడాలి రానున్న రోజుల‌లో శృతి ఏం చేయ‌బోతుందా..

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp