Tillu Square Movie : డీజేటిల్లు సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమా యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అందులోని డైలాగులు, సీన్లు మలిచిన విధానం అందరితో కెవ్వు కేక అనిపించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. సిద్దు జొన్నలగడ్డకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతోనే యూత్ లో సిద్దుకు పాపులారిటీ బాగా పెరిగిపోయింది. దాంతో ఈ క్రేజ్ ను మరోసారి వాడుకోవాలని సిద్దు జొన్నలగడ్డ డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ వస్తోంది.
ఇందులో కుర్రాళ్ల కలల రాణి అనుపమ పరమేశ్వరన్ సిద్దు సరసన నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్లు టీజర్ బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నెల 29న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మొదటి పార్టు కంటే ఎక్కువగానే కిస్సులు, రొమాన్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎవరికీ లిప్ కిస్ ఇవ్వని అనుపమ.. ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానుల గుండె బద్దలైపోయింది.
కొందరు అయితే అనుపమను ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇలా ఎందుకు చేశావ్ అంటూ ఆమెను అడుగుతున్నారు. అయితే సినిమాలో ఇవన్నీ కామనే కదా అన్నట్టు ఆమె పట్టించుకోవట్లేదు. ఏదేమైనా ఇలాంటి సీన్లు చేయకపోతే అస్సలు జనాల్లో క్రేజ్ రావట్లేదని అనుపమకు కూడా అర్థం అయింది. అందుకే ఇలాంటి పని చేస్తోంది. అయితే తాజాగా సినిమా రిలీజ్ లో భాగంగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో అనుపమ, సిద్దు మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో మొదటి పార్టు కంటే కాస్త ఎక్కువగానే రొమాంటిక్ సీన్లు ఉంటాయని.. అవి కథలో భాగంగానే ఉంటయాని సిద్దు తెలిపాడు. అనుపమ ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారేమో అంటూ ఫన్నీ డైలాగ్ పేల్చాడు. ఇక అనుపమ కూడా మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని.. ఫ్యాన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేస్తుందంటూ తెలిపింది అనుపమ.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.