Tillu Square Movie : అనుపమ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారు… టిల్లు స్వ్కేర్ పై సిద్దు కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tillu Square Movie : అనుపమ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారు… టిల్లు స్వ్కేర్ పై సిద్దు కామెంట్స్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2024,9:00 pm

Tillu Square Movie  : డీజేటిల్లు సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమా యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అందులోని డైలాగులు, సీన్లు మలిచిన విధానం అందరితో కెవ్వు కేక అనిపించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. సిద్దు జొన్నలగడ్డకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతోనే యూత్ లో సిద్దుకు పాపులారిటీ బాగా పెరిగిపోయింది. దాంతో ఈ క్రేజ్ ను మరోసారి వాడుకోవాలని సిద్దు జొన్నలగడ్డ డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ వస్తోంది.

ఇందులో కుర్రాళ్ల కలల రాణి అనుపమ పరమేశ్వరన్ సిద్దు సరసన నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్లు టీజర్ బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నెల 29న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మొదటి పార్టు కంటే ఎక్కువగానే కిస్సులు, రొమాన్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎవరికీ లిప్ కిస్ ఇవ్వని అనుపమ.. ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానుల గుండె బద్దలైపోయింది.

కొందరు అయితే అనుపమను ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇలా ఎందుకు చేశావ్ అంటూ ఆమెను అడుగుతున్నారు. అయితే సినిమాలో ఇవన్నీ కామనే కదా అన్నట్టు ఆమె పట్టించుకోవట్లేదు. ఏదేమైనా ఇలాంటి సీన్లు చేయకపోతే అస్సలు జనాల్లో క్రేజ్ రావట్లేదని అనుపమకు కూడా అర్థం అయింది. అందుకే ఇలాంటి పని చేస్తోంది. అయితే తాజాగా సినిమా రిలీజ్ లో భాగంగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో అనుపమ, సిద్దు మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నారు.

Tillu Square Movie అనుపమ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారు టిల్లు స్వ్కేర్ పై సిద్దు కామెంట్స్‌

Tillu Square Movie : అనుపమ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారు… టిల్లు స్వ్కేర్ పై సిద్దు కామెంట్స్‌..!

ఈ సినిమాలో మొదటి పార్టు కంటే కాస్త ఎక్కువగానే రొమాంటిక్ సీన్లు ఉంటాయని.. అవి కథలో భాగంగానే ఉంటయాని సిద్దు తెలిపాడు. అనుపమ ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారేమో అంటూ ఫన్నీ డైలాగ్ పేల్చాడు. ఇక అనుపమ కూడా మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని.. ఫ్యాన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేస్తుందంటూ తెలిపింది అనుపమ.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది