samantha : అందరికీ చూపిస్తుంది!.. సమంతపై చిన్మయి కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

samantha : అందరికీ చూపిస్తుంది!.. సమంతపై చిన్మయి కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :26 December 2021,1:00 pm

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడాకుల తర్వాత ఈమె పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టి సినిమాలు వెబ్ సిరీస్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూటింగులతో బిజీగా ఉంది. ఇకపోతే గతంలో సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె అవకాశాలను అందుకుంటుందని చెప్పవచ్చు.

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ నటిగా సమంత అవార్డు కూడా అందుకుంది. ఈ సిరిస్ మంచి విజయం సాధించడంతో రాజ్ అండ్ డీకే దర్శకత్వం, నిర్మాణంలో సమంత , వరుణ్ ధావన్ కలిసి యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Singer chinmayi sripaada comments on samantha

Singer chinmayi sripaada comments on samantha

samantha : సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్..

ఇదిలా ఉండగా తాజాగా సిరీస్ పై సింగర్ చిన్మయి స్పందిస్తూ సమంత గురించి కామెంట్ చేశారు. విడాకుల తర్వాత సమంత ఎంతో బిజీగా ధైర్యంగా ముందుకు సాగిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తన కెరియర్ కోసం ధైర్యంగా ముందుకు సాగుతూ ఎంతో మంది అమ్మాయిలకు తన ధైర్యం చూపిస్తోందని ఈ సందర్భంగా చిన్మయి సమంత గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిన్మయి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి