
Singer Mangli : పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ సింగర్ మంగ్లీ.. అసలు ఏం జరిగింది..!
Singer Mangli : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫోక్ సాంగ్ అయినా సరే.. ఐటెం సాంగ్ ఐనా సరే మంగ్లీ పాడిందంటే చాలు పూనకాలు రావల్సిందే. ఆనతి కాలంలో స్టార్ సింగర్‌గా మారిన మంగ్లీ బంజరా మహిళగా ఆకట్టుకున్నారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్, బతుకమ్మ, బోనాలు, సమక్క సారక్క, శివరాత్రి సాంగ్స్ పాడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి దగ్గరైంది. పొలిటికల్ గానూ కొన్ని సాంగ్స్ పాడి అదరగొట్టింది.నటిగాను అదరగొడుతుంది. స్వేచ్చ, గువ్వ గోరింక, మ్యాస్ట్రో వంటి చిత్రాలలో నటించి తన నటనతో అదరగొట్టింది.
మంగ్లీ ఈ మహాశివరాత్రికి డంగురు డంగురూ అంటూ సాగే ఈ కొత్త పాట విడుదల చేసింది. ఈ పాట ప్రతి ఒక్కరికి నచ్చేసింది. తెలుగులోనే కాక తమిళ్, హిందీ, కన్నడలో కూడా ఈ పాటని విడుదల చేశారు. అంతటా మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే మంగ్లీ తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలలోకి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలకి కూడా ఆమె పాటలు ఆలపిస్తూ ఉంటుంది. మంగ్లీ పెళ్లికి సంబంధించి ఆ మధ్య పలు వార్తలు రాగా వాటిని ఖండించింది. నాకు తెలియకుండానే నా పెళ్లి మా బావతో చేసేస్తున్నారు. నాకే తెలియని ఆ బావ ఎవరో కొంచెం చెబుతారా అంటూ ప్రచారాలని ఖండించింది మంగ్లీ. ప్రస్తుతం కెరీర్ ఫుల్ బిజీగా ఉండగా, ఆమె నిన్న అర్ధరాత్రి ఓ షోకి వెళ్లి వస్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది. షో పూర్తైన తర్వాత అర్థరాత్రి సమయంలో మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి మంగ్లీ తన కారులో హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి వెళుతుంది. అయితే శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారులో మంగ్లీ సేఫ్‌గానే ఉండగా, మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తుంది.డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.