Home » Entertainment » Singer Mano Also Out Of From Jabardasth Show In Very Soon
Entertainment

Jabardasth : జబర్దస్త్‌ నుండి మరో జడ్జ్‌ కూడా సైడ్‌ అవ్వబోతున్నారా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 19, 2022, 4:30 pm
Advertisement

Jabardasth : తెలుగు బుల్లి తెర పై కామెడీ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్‌. ఏ ఇండియన్ బుల్లి తెర షో కు కూడా రాని రేటింగ్ ను ఒకప్పుడు జబర్దస్త్‌ దక్కించుకుంది. అద్బుతమైన జబర్దస్త్‌ కామెడీ షో ను వారంలో దాదాపుగా పది సార్లు వేసే వారు. అంతగా ఈటీవీ భారం మోసిన జబర్దస్త్‌ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితికి దిగ జారి పోయింది. మొదట జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు సైడ్ అయిన సమయంలోనే జబర్దస్త్‌ పనైపోయిందని అంతా భావించారు. కాని అనూహ్యంగా నాగబాబు లేకున్నా కూడా ఆది మరియు ఇతర టీమ్‌ మెంబర్స్ అంతా ఉండటంతో ఎలాంటి డ్యామేజీ జరగక పోగా మంచి రేటింగ్ వచ్చింది.

Advertisement

ఎప్పుడైతే రోజా జడ్జ్‌ సీటు నుండి తప్పుకుందో అప్పటి నుండి జబర్దస్త్‌ కు కష్టాలు మొదలు అయ్యాయి. రోజా వెళ్లడానికి కొన్ని రోజుల ముందు నుండే ఆది కనిపించలేదు. ఆయన మళ్లీ వస్తాడని అంతా అనుకున్నారు. కాని రోజా వెళ్లి పోయాక ఆయన తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. సుడిగాలి సుధీర్ మరియు గెటప్ శ్రీను కూడా వెళ్లి పోయారు. ఇప్పుడు మరో జడ్జ్ గా ఉన్న సింగర్ మనో కూడా వెళ్లి పోవడానికి సిద్దంగా ఉన్నాడేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఈటీవీ వర్గాల నుండి కారణాలు కూడా క్లీయర్ గా వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా డైరెక్షన్ టీమ్‌ లేకపోవడంతో పాటు టీమ్‌ లీడర్స్ కూడా వెళ్లి పోవడంతో మనో కు పెద్దగా షో చేయాలనే ఆసక్తి కలగడం లేదట.

singer mano also out of from jabardasth show in very soon

Advertisement

చెన్నై నుండి వచ్చి మనో ఈ షో ను చేయడం ద్వారా పెద్దగా దక్కుతున్నది.. మిగులుతున్నది ఏమీ లేదట. ఏదో ఫ్యాషన్ కోసం.. ఎంటర్‌ టైన్మెంట్‌ కోసం ఆయన వచ్చి ఈ షో ను చేసి వెళ్తున్నాడట. ఇప్పుడు ఆ ఆసక్తి లేకుండా పోయిందట. అందుకే పదే పదే షెడ్యూల్స్ ను మిస్‌ చేస్తూ వస్తున్నాడు. ఈ వారం కూడా మనో లేకుండానే జబర్దస్త్‌ షో సాగింది. కనుక ఆయన మళ్లీ జబర్దస్త్‌కు వస్తాడో లేదో తెలియడం లేదు. ఎందుకంటే ఆయన కూడా జబర్దస్త్‌ కు శాస్వతంగా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన స్థానంలో లైలా వస్తున్నారు. మరో వైపు ఇంద్రజ కనిపిస్తున్న విషయం తెల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి