Singer Proposed : స్టేజ్ మీద ఆమెకు ప్రపోజ్ చేసిన సింగర్.. చూసిన వాళ్లంతా షాక్ అయ్యేలా వాళ్లిద్దరి వ్యవహారం..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 November 2022, 9:40 pm

Singer Proposed : బుల్లితెర మీద జబర్దస్త్ కమెడియన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కనిపిస్తూనే మరో పక్క ఈటీవీ వారు ఏర్పాటు చేసే స్పెషల్ షోస్ లో కూడా వారిని వాడేస్తుంటారు. ఫెస్టివల్స్ కి స్పెషల్ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంటారు మల్లెమాల టీం.

ఈ క్రమంలో బాలల దినోత్సవం సందర్భంగా లిటిల్ హార్ట్స్ అనే ఒక స్పెషల్ షో సిద్ధం చేస్తున్నారు. ఈ షోలో బుల్లితెర సెలబ్రిటీస్ వారి పిల్లలతో పాల్గొన్నారు. ఈ షోలో పల్సర్ బైక్ సింగర్ రమణ బుల్లితెర మీద అడపాదడపా కనిపించే నటి భానుకి లవ్ ప్రఓజ్ చేశాడు. అతను చేసిన ప్రపోజల్స్ కి అమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

వీడియో: స్టేజిపై జబర్దస్త్ భానుకి ప్రపోజ్ చేసిన సింగర్ రమణ!

మోకాలి మీద కూర్చుని మరీ భానుకి లవ్ ప్రపోజ్ చేశాడు రమణ. ప్రస్తుతం ఈ ప్రోమో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. నవంబర్ 13 ఆదివారం ఈ షో టెలికాస్ట్ అవనుంది. లిటిల్ హార్ట్స్ స్పెషల్ ఎపిసోడ్ కి హైపర్ ఆది హోస్ట్ గా ఉంటున్నారు. అయన పంచులు కూడా ఈ స్పెషల్ ఎపిసోడ్ కి హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు. ప్రోమోలో మాత్రం హైలెట్ అంటే ఆ లవ్ ప్రపోజల్ అని చెప్పుకోవచ్చు.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి